ఆ కమెడియన్ కు హగ్ ఇచ్చిన దీపికా పిల్లి.. ఛాలెంజ్ గెలవడంతో..?

టిక్ టాక్ వీడియోలు చేసి పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో దీపికా పిల్లి ఒకరనే సంగతి తెలిసిందే.అయితే ఢీ షోలో టీమ్ లీడర్ అయిన తరువాత దీపికా పిల్లికి ఎక్కువ గుర్తింపు వచ్చింది.

 Comedian Hyper Aadi Hugs Deepika Pilli In Dhee 13 Show, Aadi Hugs, Deepika Pilli-TeluguStop.com

పలు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ దీపికా పిల్లి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా దీపికా పిల్లి హైపర్ ఆదికి హగ్ ఇచ్చారు.

దీపిక హగ్ ఇవ్వడంతో హైపర్ ఆది తెగ మురిసిపోయారు.

యాంకర్ ప్రదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లకు వెల్ కమ్ చెప్పాలని వాళ్లను ఎత్తుకోవాలని ఆదికి ఛాలెంజ్ ఇస్తాడు.

అయితే ఆది మాత్రం ఇద్దరినీ ఎత్తుకోవడంలో ఫెయిల్ అవుతాడు.ఆ తరువాత రష్మీ మీరు కరెక్ట్ గా చేస్తే దీపికా వచ్చి హగ్ ఇస్తుందని ఆదికి చెబుతుంది.

దీపిక హగ్ ఇస్తానంటే ఐదుగురు ఎక్కినా ఓకే అని ఆది చెబుతారు.

హైపర్ ఆది ఛాలెంజ్ ను పూర్తి చేయడంతో సుధీర్ దీపికను ఆదికి హగ్ ఇవ్వాలని చెబుతాడు.

ఒకవేళ దీపిక ఆదికి హగ్ ఇవ్వకపోతే మాత్రం తాను రష్మీకి హగ్ ఇస్తానని సుధీర్ చెప్పడంతో అవక్కవ్వడం రష్మీ వంతవుతుంది.ఆ తరువాత దీపికా పిల్లి తాను ఇంప్రెస్ అయ్యానంటూ దీపికా పిల్లి ఆదికి హగ్ ఇస్తారు.

అయితే ఆది మాత్రం హగ్ చేసుకుని వదలకుండా అలానే పట్టుకుంటారు.

ఆ తరువాత రష్మీ ఈ అప్రిషియేషన్ చాలు అని ఆది దీపికను వదిలేస్తారు.ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

జూన్ నెల 2వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లు ఈ ఎపిసోడ్ లో పాల్గొన్నారు.ఇకపోతే గత కొన్నేళ్ల నుంచి శేఖర్ మాస్టర్ ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తుండగా ఆయన ఈ షో నుంచి కొన్ని కారణాల వల్ల తప్పుకున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube