పెళ్లిపై సూపర్ క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది.. పెళ్లి ఎప్పుడంటే?

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నైపుణ్యం గలవారు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

 Hyper Aadi Giving The Clarity On His Marriage When Is The Wedding Details, Hype-TeluguStop.com

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పరిచయమైన వారు ప్రస్తుతం వెండితెరపై కూడా తమ హవా కొనసాగిస్తూనే కెరియర్లో దూసుకుపోతున్నారు.ఇలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది హైపర్ ఆది, సుడిగాలి సుధీర్.

వీరిద్దరూ ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబంలో నుంచి సొంత నైపుణ్యంతో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు.ముందుగా ఇతరుల స్కిట్ లో పాల్గొంటున్న వీరు ఏకంగా టీం లీడర్స్ గా మారిపోయారు.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం పై హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వేసే పంచ్ లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్ వచ్చిందంటే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు.

ఒక పంచ డైలాగ్ పూర్తయి దాని నుంచి కోలుకొనేలోపు మరొక డైలాగ్ వేస్తూ ఎంతో వినోదాన్ని పంచుతారు.హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నప్పటికీ ఈయన పెళ్లి గురించి నిత్యం వార్తలు వినబడుతూనే ఉంటాయి.

గత కొద్ది రోజుల క్రితం కూడా హైపర్ ఆది పెళ్లి కుదిరింది తమ సొంత జిల్లాకు, తమ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినే హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

Telugu Alithosaradaga, Clearty, Dhee, Getup Srinu, Hyper Aadi, Jabardasthhyper,

ఈ క్రమంలోనే హైపర్ ఆది, గెటప్ శ్రీను ఇద్దరు కలిసి అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఆలీతో సరదాగా కార్యక్రమానికి వెళ్లారు.ఈ కార్యక్రమంలో భాగంగా అలీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు.దీంతో గెటప్ శ్రీను తో మాట్లాడుతూ మీకు పెళ్లి అయ్యిందా అని అడిగారు.

అందుకు గెటప్ శ్రీను అయింది సార్ అని సమాధానం చెప్పగా అదే ప్రశ్న హైపర్ ఆదిని వేయడంతో హైపర్ ఆది తనకింకా పెళ్లి కాలేదని వెల్లడించారు.ఆది ఆ సమాధానం చెప్పగానే వెంటనే అలీ ఎప్పుడు చేసుకుంటున్నారు అని ప్రశ్నించగా.

అందుకు ఆది మాట్లాడుతూ నాకు ఇప్పుడు ఇంకా 27 సంవత్సరాలు ఇంకో రెండు సంవత్సరాలు ఆగి పెళ్లి చేసుకుందాం అని భావిస్తున్నాను సార్ అంటూ సమాధానం చెబుతారు.

Telugu Alithosaradaga, Clearty, Dhee, Getup Srinu, Hyper Aadi, Jabardasthhyper,

ఇక రెండు సంవత్సరాలలో తను సాధించాల్సిన విజయాలు ఎన్నో ఉన్నాయని వాటిలో కొన్నింటినైనా పూర్తి చేసి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నానని హైపర్ ఆది తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.హైపర్ ఆది ఈ విధంగా తన పెళ్లి గురించి బయటపెట్టడంతో ఇప్పటివరకు సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు ఈ విధంగా చెక్ పెట్టినట్లు అయింది.ఇక హైపర్ ఆది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో విషయాలను ముచ్చటించారు.

ఇకపోతే గతంలో ఒక కార్యక్రమం ద్వారా తన జీవితంలో జరిగిన అనుభవాన్ని బయటపెట్టారు.

Telugu Alithosaradaga, Clearty, Dhee, Getup Srinu, Hyper Aadi, Jabardasthhyper,

తాను ఉద్యోగం చేయడం కోసం ఎన్నో ఇంటర్వ్యూలకు వెళితే అక్కడ తెలుగులో మాట్లాడానని తనకి ఉద్యోగం ఇవ్వలేదని చెప్పిన హైపర్ ఆది ఇప్పుడు అదే తెలుగు మాట్లాడుతూ ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నానని తెలిపారు.ఎప్పటికైనా తను కేవలం తెలుగు మాట్లాడే వారి కోసమే కొత్త కంపెనీ పెడతానని హైపర్ ఆది చెప్పడం విశేషం.హైపర్ ఆది కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలలో పాల్గొని ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమా అవకాశాలు దక్కించుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube