జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో హైపర్ ఆది ఒకరు.అయితే ప్రస్తుతం జబర్దస్త్ మినహా ఇతర షోలతో హైపర్ ఆది బిజీగా ఉన్నారు.
అయితే హైపర్ ఆది పలు సందర్భాల్లో వేసే పంచ్ లు, కామెంట్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.తాజాగా నేను మీకు బాగా కావాల్సినవాడిని ఈవెంట్ లో హైపర్ ఆది చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైపర్ ఆది మాట్లాడుతూ బేసిక్ గా నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం అని అన్నారు.పవన్ కళ్యాణ్ మాట విన్నా పవన్ కళ్యాణ్ పాట విన్నా నోటి నుంచి అరుపులు, వేళ్లకు తెలియకుండా విజిల్స్, చేతికి తెలియకుండా చప్పట్లు వస్తాయని హైపర్ ఆది అన్నారు.
నాకు తెలిసి పవన్ తర్వాత మళ్లీ ఆ స్థాయికి వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారా అంటే కిరణ్ అబ్బవరం మాత్రమేనని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.

ఆది వ్యాఖ్యలపై పవన్ అభిమానులతో పాటు సాధారణ అభిమానులు సైతం మాత్రం మండిపడుతున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారని పవన్ ను దాటి వచ్చే వ్యక్తి లేరని కామెంట్లు చేస్తున్నారు.పవన్ అభిమాని అయ్యి ఉండి ఇలాంటి వివాదాస్పద కామెంట్లు అవసరమా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
నిన్ను దేనితో కొట్టాలంటూ మరి కొందరు ఆదిపై విరుచుకుపడుతున్నారు.హైపర్ ఆదికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఇలాంటి వివాదాస్పద కామెంట్లు ఆయనను ఫ్యాన్స్ కు దూరం చేస్తున్నాయి.
హైపర్ ఆది వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.