బిగ్‌బాస్‌లో హైపర్‌ ఆది పంచ్‌లు నవ్వించని కారణం ఇదేనట  

hyper aadi comedy not went well in bigg boss samantha episode , bigg boss, hyper aadi, samantha, dasara special episode, nagarjuna - Telugu Aadi Comedian, Bb4, Bigg Boss, Dasara Special Episode, Hyper Aadi, Hyper Aadi Comedy Not Went Well In Bigg Boss Samantha Episode, Jabardast Aadi, Nagarjuna, Samantha

జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది పంచ్‌ లకు ఎవరైనా, ఎక్కడైనా పడి పడి నవ్వాల్సిందే.జబర్దస్త్‌ లోనే కాకుండా ఢీ లో కూడా ఆది వేసే పంచ్‌ లు కామెడీ స్కిట్‌ లు ఆకట్టుకుంటున్నాయి.

TeluguStop.com - Hyper Aadi Comedy Not Went Well In Bigg Boss Samantha Episode

బిగ్‌బాస్‌ లో మొన్న ఆదివారం దసరా స్పెషల్‌ మారథాన్‌ ఎపిసోడ్‌ లో కొంత సమయం ఆది సందడి చేశాడు.సమంత పక్కన నిలబడి డిటెక్టివ్‌ ఆదిగా నవ్వించే ప్రయత్నం చేశాడు.

ఇంటి సభ్యుల్లో ఒకొక్కరి మనసులో ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని ఆది చెప్తానంటూ ముందుకు వచ్చాడు.అయితే ఆది మాత్రం ఈసారి అంతగా నవ్వించలేక పోయాడు.

TeluguStop.com - బిగ్‌బాస్‌లో హైపర్‌ ఆది పంచ్‌లు నవ్వించని కారణం ఇదేనట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆది అంటే హైపర్‌ పంచ్‌లు ఉంటాయి.కాని బిగ్‌బాస్ వారు రాసిన స్క్రిప్ట్‌ అవ్వడం వల్ల పెద్దగా నవ్వించలేక పోయాడు.

సాదారణంగా స్క్రిప్ట్‌ తనకు తానే రాసుకుంటే ఖచ్చితంగా నవ్విస్తాడు.కాని బిగ్‌ బాస్‌ డైరెక్టర్‌ సూచన మేరకు డిటెక్టివ్‌ అంటూ వచ్చాడు.
బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌కు ఆదికి ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు.అందుకే ఆయన సొంతంగా స్క్రిప్ట్‌ రెడీ చేసుకోలేక పోయాడు.వారు ఇచ్చిన స్క్రిప్ట్‌ వల్ల సో సోగానే అనిపించాడు.ఆది బిగ్‌బాస్‌ లో వస్తున్నాడు అనగానే చాలా మంది చాలా అంచనాలు పెట్టుకున్నారు.

కాని షో నిర్వాహకులు ఆదిని వినియోగించుకోవడంలో విఫలం అయ్యారు.అయితే సింగర్స్‌ పెర్ఫార్మెన్స్‌ మరియు కార్తీకేయ మరియు పాయల్‌ ల డాన్స్‌ ల కంటే ఆదిది పర్వాలేదు అన్నట్లుగా ఉంది.

మూడు గంటల పాటు షో సాగడం వల్ల కాస్త ప్రేక్షకులు బోర్‌ ఫీల్‌ అయ్యారు.ఈ సారి గంటన్నర వస్తే ఖచ్చితంగా సమంత ఆకట్టుకుంటుందనే నమ్మకం అందరు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం షోకు సంబంధించిన హోస్ట్ గురించి మళ్లీ చర్చ జరుగుతోంది.నాగార్జున వస్తాడా రాడా అనే విషయంలో స్పష్టత లేదు.

రోజుకు ఒక వార్త వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగబోతుంది.రేటింగ్‌ కోసం నిర్వాహకులు ఏమైనా జిమ్మిక్కులు చేస్తారా అనేది చూడాలి.

#Nagarjuna #HyperAadi #Aadi Comedian #Samantha #Hyper Aadi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hyper Aadi Comedy Not Went Well In Bigg Boss Samantha Episode Related Telugu News,Photos/Pics,Images..