హైపర్ ఆదిని బావ అన్న ప్రియమణి.. బ్రేక్ ఫాస్ట్, లంచ్ అంటూ ..?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన ఢీ షో ప్రేక్షకాదరణ పొందుతున్న షోగా గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటివరకు ఢీ 12 సీజన్లు విజయవంతంగా ప్రసారం కాగా ప్రస్తుతం ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ పేరుతో 13వ సీజన్ ప్రసారమవుతోంది.

 Hyper Aadi And Sudigali Sheer Went Maldives Tour With Priyamani And Poorna In Dhee Show-TeluguStop.com

తాజాగా విడుదలైన ప్రోమోలో స్కిట్ లో భాగంగా హైపర్ ఆది ప్రియమణితో కలిసి మాల్దీవులకు వెళ్లారు.ఆది ప్రియమణితో ఇలాంటి అవకాశం మళ్లీ రాదు అని చెప్పగా ప్రియమణి అవును బావా అంటూ ఆది చేతిలో చెయ్యి వేస్తారు.

ఆ తరువాత సుడిగాలి సుధీర్ పూర్ణతో కలిసి ఎంట్రీ ఇస్తాడు.ఆది ప్రతిసారి వీళ్ల ఎంట్రీ ఏంటి ప్రియ అనగా సుధీర్ మీరే మేము ఎక్కడ ఉంటే అక్కడికి వస్తున్నారని చెబుతాడు.

 Hyper Aadi And Sudigali Sheer Went Maldives Tour With Priyamani And Poorna In Dhee Show-హైపర్ ఆదిని బావ అన్న ప్రియమణి.. బ్రేక్ ఫాస్ట్, లంచ్ అంటూ ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీరు బయట ఉంటారా.? లేక బీచ్ దగ్గరకు వెళతారా.? సుధీర్ ఆదిని అడగగా ఆది మీరేం ప్లాన్ చేశారు అని సుధీర్ ను అడుగుతాడు.అందుకు సుధీర్ మేము బయటికి రాము అని చెబుతాడు.

ఆది ప్రియమణితో నీకు ఇడ్లీ కావాలా.? దోశ కావాలా.? అని అడగగా నీకేది ఇష్టమైతే అది తీసుకురావాలని ప్రియమణి చెబుతుంది.

మాల్దీవులు వచ్చి దోశ పెడతారా బావా.? నాకు వేరే బ్రేక్ ఫాస్ట్ కావాలి అని ప్రియమణి చెప్పగా నేను అదే అడుగుతున్నానని ఆది చెబుతాడు.సుధీర్ నాకు ఫ్రాన్స్ కావాలని పూర్ణ అడగగా నా దగ్గర ఆదిలా బ్రేక్ ఫాస్ట్ లు లేవు మనది అంతా మెయిన్ కోర్సే అని సుధీర్ వెల్లడిస్తాడు.

ఆ తర్వాత ప్రదీప్ రూమ్ సర్వీస్ అంటూ ఎంట్రీ ఇచ్చి మేడమ్ వాళ్ల బాయ్ ఫ్రెండ్ వస్తానని చెప్పారు రాలేదా సార్ అని అడుగుతాడు.

ఆది నేనే మేడమ్ బాయ్ ఫ్రెండ్ ను అని చెబుతాడు.ఆ తరువాత సుధీర్ ఆదితో కాయిల్ ఉందా.? దోమలు కుడుతున్నాయ్ అంటాడు.దోమలైనా అది పెడితే పోతయ్ నువ్వు కుట్టేదానికి ఏం పెట్టాలో చెప్పు అంటూ ఆది పంచ్ వేస్తారు.

#Hyper Aadi #Dhee Show #Dhee 13 #Anchor Pradeep #PriyamaniAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు