స్టేజ్ పై ఇమ్మాన్యుయేల్ ను హత్తుకున్న రోహిణి.. ఎందుకంటే..?

సినిమా, టీవీ రంగాల్లో గుర్తింపును సొంతం చేసుకోవాలంటే అందంగా కనిపించడం కంటే ప్రతిభ ముఖ్యమనే సంగతి తెలిసిందే.అలా ప్రతిభతో జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

 Hyper Aadi And Rohini Shocks On Emmanuel Singing Talent-TeluguStop.com

జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీలో ప్రసారమయ్యే ఇతర ఈవెంట్లలో సైతం ఇమ్మాన్యుయేల్ కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు.

అయితే ఈ వారం ఇమ్మాన్యుయేల్ తనలో ఉన్న మరో టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

 Hyper Aadi And Rohini Shocks On Emmanuel Singing Talent-స్టేజ్ పై ఇమ్మాన్యుయేల్ ను హత్తుకున్న రోహిణి.. ఎందుకంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను పాటలు అద్భుతంగా పాడగలనని ప్రేక్షకులకు తెలియజేశారు.మదర్స్ డే సందర్భంగా ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ లో నాని సినిమాలోని “పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ” పాటను అద్భుతంగా పాడారు.

పాట అద్భుతంగా పాడటంతో రోహిణి ఇమ్మాన్యుయేల్ ను స్టేజ్ పైనే హత్తుకున్నారు.

ఈ షో ప్రోమోలో స్కిట్లు కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి.హైపర్ ఆది టీమ్ లో ఉండేవాళ్లు దాదాదాదా అని అరుస్తుంటే ఆది ఏదో పాత ఎపిసోడ్లకు పేమెంట్లు అడుక్కుంటున్నట్టు ఏంటి ఆ అడుక్కోవడం అని ఆది పంచ్ వేస్తారు.ఆ తరువాత ఒక వ్యక్తి ఈ కొడవలికి ఎందుకన్నా నిమ్మకాయ పెట్టినారు.? అని అడగగా నీకు పెడితే బాగోదని కొడవలికి నిమ్మకాయ పెట్టామంటూ ఆది వెటకారంగా సమాధానం ఇస్తాడు.

ఆ తరువాత రామ్ ప్రసాద్ వాళ్లు మండే పనులు చేస్తున్నారని చెప్పగా అన్నపూర్ణ టూస్ డే, వెడ్ నెస్ డే ఆపై రోజులు వాళ్లు ఏం పని చేస్తారంటూ పంచ్ వేస్తారు.

ఆ తర్వాత పండు జాతర ఘనంగా జరగాలంటే ఎధవలు ఉండకూడదు ఇక్కడ.? అని చెప్పగా రామ్ ప్రసాద్ మనల్ని వెళ్లిపోమని అంటున్నావా.? అంటూ పంచ్ వేస్తారు.ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈటీవీలో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

#Annapoorna #Hyper Aadi #Jabardasth #Nani #SrideviDrama

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు