బాలకృష్ణ వార్నింగ్‌పై స్పందించిన ఆది... ఇతడు చెప్పిందాంట్లో నిజం ఉందా?  

  • జబర్దస్త్‌ అంటేనే కామెడీకి పెట్టింది పేరు. అప్పటికే తెలుగు బుల్లి తెరపై సంచలన టీఆర్పీని నమోదు చేసిన జబర్దస్త్‌ ఆది రాకతో ఆకాశమే హద్దుగా పెరిగి పోయింది. అద్బుతమైన టీఆర్పీ రేటింగ్‌లను దక్కించుకున్న జబర్దస్త్‌ కామెడీ షో ఆది కామెడీ పంచ్‌లు మరియు నవ్వులతో మొత్తం జబర్దస్త్‌ను మార్చేశాడు. ఆది ఆమద్య మూడు నెలల పాటు జబర్దస్త్‌లో కనిపించక పోవడంతో అంతా కూడా అవాక్కయారు. అసలు జబర్దస్త్‌కు ఆది రాడేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాని జబర్దస్‌కు ఆది రీ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్‌ అంతా కూడా ఖుషీ అవుతున్నాయి.

  • Hyper Aadi About Balakrishna Warning-Hyper Jabardast Anchor Anasuya Roja Nagababu

    Hyper Aadi About Balakrishna Warning

  • ఈ సమయంలోనే ఆది ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. మీడియాలో ఆమద్య ఆదికి బాలకృష్ణ పిలిచి మరీ వార్నింగ్‌ ఇచ్చాడు అంటూ ప్రచారం జరిగింది. తనపై కామెడీ పంచ్‌లు వేసిన కారణంగా పిలిచి వార్నింగ్‌ ఇచ్చినట్లుగా, ఆదిని కొట్టించేందుకు కూడా నందమూరి అభిమానులు ప్రయత్నించారు అంటూ ప్రచారం జరిగింది. ఆది కూడా నందమూరి ఫ్యాన్స్‌కు తన స్కిట్స్‌ ద్వారా ఇండైరెక్ట్‌గా పంచ్‌లు వేసి వార్నింగ్‌ ఇచ్చాడు. తనను ఏం చేయలేరు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానిని అంటూ ఆది పదే పదే చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.

  • Hyper Aadi About Balakrishna Warning-Hyper Jabardast Anchor Anasuya Roja Nagababu
  • బాలకృష్ణ పిలిచి వార్నింగ్‌ ఇచ్చిన విషయమై ఆది తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నన్ను బాలకృష్ణగారు పిలిపించిన వార్తలు నిజం కాదు, అసలు అందులో వాస్తవం లేదు. ఒకసారి ఆభి స్కిట్‌లో ఎన్టీఆర్‌ వేశం వేసినందుకు గాను ఫ్యాన్స్‌ కొందరు హెచ్చరించారు. ఆ విషయాన్ని నేను ఒక సందర్బంలో చెప్పగా, నన్ను బాలకృష్ణ పిలిచి వార్నింగ్‌ ఇచ్చాడు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఈ విషయంలో గతంలోనే పలు సార్లు నేను మీడియాకు క్లారిటీ ఇచ్చినా కూడా పదే పదే వార్తలు వచ్చాయి. కాని ఆదికి బాలయ్య వార్నింగ్‌ ఇచ్చాడనే వార్తలు మాత్రం తగ్గడం లేదు. నేను వాటిని పట్టించుకోవడం మానేశాను అంటూ చెప్పుకొచ్చాడు.

  • Hyper Aadi About Balakrishna Warning-Hyper Jabardast Anchor Anasuya Roja Nagababu