సింహాం, పులులు, చిరుతపులి లాంటి జంతువులను చూస్తే మనుషులకే కాదు.జంతువులకు కూడా భయమే.
జంతువులు( Animals ) కనిపిస్తే వాటిని వెంటాడి చంపేస్తాయి.చంపేసిన వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి క్రూరమృగాలు.
అయితే కొన్ని జంతవులు క్రూరమృగాల నుంచి తెలివిగా తప్పించుకుంటూ ఉంటాయి.ఒక్కొక్కసారి ఏదైనా జంతువులు కంటికి కనిపించినా క్రూరమృగాలు తప్పించుకుంటాయి.
ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఒక చిరుతపులి( Leopard ) అడవిలో నడిరోడ్డుపై కూర్చుని సేద తీరుతుంది.ఈ సమయంలో చిరుతపులికి ఎదురుగా ఒక హైనా నడుచుకుంటూ వెళుతుంది.చిరుతపులి దానిని చూసింది.అయినా హైనా మాత్రం భయపడకుండా అలాగే నడుచుకుంటూ వెళ్లింది.చిరుత ముందుకు వచ్చాక హైనా దారి మార్చుకుంది.చిరుత ముందు నుంచి కాకుండా మరో దారిలో వెళ్లింది.
బాస్ ఎదురుగా ఉంటే ఎంత లౌక్యంగా ప్రవర్తించాలనేది ఈ వీడియో ద్వారా తెలుస్తుంది.లేట్స్ టుకుర్రగర్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో హైనా తెలివికి అందరూ మెచ్చుకుంటున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.దీనిని స్మార్ట్ మూవ్ అంటారని కొంతమంది అంటుండగా.సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే తెలివిగా బయటపడవచ్చని మరికొందరు అంటున్నారు.
ఈ హైనా ( Hyena ) కూడా అదే చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.ఇక ఈ చిరుతపులికి ఆకలిగా లేదని, అందుకే హైనా కనిపించినా వదిలిపెట్టిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ చిలుత కడుపునిండా తిని హాయిగా పడుకుందని, అందుకే హైనాను పట్టించుకోలేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు .ఇలా నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి.అలాగే కామెంట్లు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి.