అమెరికా సంస్థ సర్వే: ట్రంప్ సైతం వెనకాలే.. అగ్రస్థానంలో మోడీ

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో సమూలమైన మార్పులు చేపట్టారు.ఇతర దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పేందుకే తొలి ప్రాధాన్యత ఇచ్చారు.

 Hydroxychloroquine Tablets, Lockdown, Vaccine Supply, Modi Popularity, Morning C-TeluguStop.com

దీనిలో భాగంగా మరే భారత ప్రధాని చేపట్టని విధంగా విదేశీ పర్యటనలు చేశారు.ఆ ప్రయత్నం వృథా పోలేదు.

దేశాధినేతల వద్ద ఇండియా వెయిట్ బాగా పెరిగింది.అలాగే మోడీ పాపులారిటీ సైతం ఎవరెస్ట్‌ను తాకింది.

కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్, ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా, పేద దేశాలకు హైడ్రాక్సిక్లోరోక్విన్ టాబ్లెట్‌లు తదితర అత్యవసర సామాగ్రిని అందజేశారు.

తాజాగా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగన నేతగా మోదీ రికార్డుల కెక్కారు.

ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతల్లో ఎవరెవరు అత్యంత ప్రజాధరణ కలిగిన నేతలు.? అన్న విషయమై ఆ సంస్థ పరిశోధన చేసింది.దీంట్లో మోడీ అగ్రస్థానంలో ఉండగా.ట్రంప్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.

Telugu Australia, Australianprime, Brazil, Canada, Germany, India, Italy, Japan,

మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా పరిశోధన సంస్థ చేసిన సర్వే ప్రకారం సుమారు 55 శాతం మంది భారతీయులు ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరిచారు.భారత్, మెక్సికో, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, ఇటలీ, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా, యూకే, స్పెయిన్, జపాన్ వంటి దేశాల్లో ప్రజల నుంచి కూడా అభిప్రాయ సేకరణ జరిగింది.మోడీ కంటే బలమైన అగ్రరాజ్యాధినేతలను దాటుకుని మరీ పాపులారిటీలో మోడీ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.

ప్రధాని తర్వాతి స్థానంలో మెక్సికో అధినేత లోపేజ్ నిలవగా, తృతీయ స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్థానం సంపాదించారు.

సర్వేలో మోడీ అగ్రస్థానంలో నిలవడంతో ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్, ఇతర మంత్రులు అభినందించారు.మోడీ సామర్ధ్యం, పనితీరుకు ఇది నిదర్శనమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.బీజేపీ నేతలతో పాటు సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు కూడా మోడీని ప్రశంసించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube