మందు బాబులకు ఝలక్ ఇచ్చిన కోర్టు, వాహనదారులకు ఇక కష్టమే

మందు బాబులకు హైదరాబాద్ కోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది.కొత్త వాహన చట్టం అమలు లోకి వచ్చిన తరువాత ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ స్థాయిలో ఫైన్ లు విధిస్తున్న విషయం విదితమే.

 Hyderabadman Gotfiners10500fine Fordrunkand Drive-TeluguStop.com

అయితే కేంద్రం సవరించిన కొత్త మోటార్ వెహికిల్ చట్టం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలు పరచడమే లేదు.కానీ మద్యం తాగి వాహనం నడిపాడని గుణశేఖర్ అనే వ్యక్తికి ఏకంగా 10 వేల 500 రూపాయల జరిమానా విధించింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కడం తో గుణశేఖర్ పై కేసు నమోదు చేసిన కోర్టు లో హాజరు పరిచారు.ఈ నేపథ్యంలో కేసును విచారించిన హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు మార్చిన కొత్త చట్టం ప్రకారం ఫైన్‌ విధించి మందు బాబులకు గట్టి ఝలక్ ఇచ్చింది.

కేంద్రం సవరించిన కొత్త మోటార్ వెహికిల్ చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలుపరచకుండానే ఇంతకు ముందు కూడా ఓ వాహనదారుడికి ఈ చట్టం ప్రకారం ఫైన్ వేశారు.అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే సాధారణంగా రూ.2000/- జరిమానా ఉండేది, కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం రూ.10000/- పెనాల్టీ పడింది.నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Telugu Imposesfine, Drunk Drive, Hyderabadfine-

మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ తర్వాత అతన్ని మంగళవారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, తొలి నేరంగా భావించిన న్యాయమూర్తి రూ.10000/- జరిమానా విధించడం విశేషం.అయితే జరిమానా చెల్లించకపోతే.15 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేయడం తో మందు బాబు లకు గట్టి ఝలక్ ఇచ్చినట్లు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube