ఈ మధ్య కాలంలో కొందరు డబ్బు సంపాదించాలనే మోజులో పడి ప్రేమ, పెళ్లి వంటి బంధాలను అపహాస్యం చేస్తున్నారు.కాగా తాజాగా ఓ వ్యక్తి అక్రమ దారుల్లో డబ్బు సంపాదించాలని నిత్య పెళ్లి కొడుకుగా మారి పెళ్లి కావాల్సిన యువతులను టార్గెట్ చేస్తూ అందినంతా దోచుకుంటూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సంధ్య ( పేరు మార్చాం ) అనే యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.కాగా ఇటీవలే సంధ్య చదువులు పూర్తి కావడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని యోచనలో ఉన్నారు.
ఈ క్రమంలో పలు మ్యాట్రిమోనియల్ సంస్థలను సంప్రదించి ఆమెకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరిచారు.దీంతో తాజాగా మాట్రిమోనియల్ కి సంబంధించిన వ్యక్తి నుంచి వరుడు సంధ్య కి ఫోన్ చేసి వివరాలు కనుగొన్నాడు.
దీంతో ఇరువురి అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
ఈ క్రమంలో వరుడు సంధ్య కి ఫోన్ చేసి తన పెళ్లి అయిన తర్వాత అమెరికాలో సెటిల్ కావాలని ఉందని దాంతో ఇద్దరూ కలిసి వీసా కి సంబంధించిన పనులు పూర్తి చేద్దామని అందుకుగాను ఇంటర్నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు జమ చేయాలని సూచించాడు.
దీంతో ఇది నమ్మిన సంధ్య దాదాపుగా పది లక్షల రూపాయలకుపైగా వరుడి ఖాతాలో జమ చేసింది.అనంతరం అమెరికాలో సెటిల్ కాబోతున్న సంబరంలో మునిగిపోయింది.
కానీ ఈ సంబరం ఎంతో కాలం నిలవలేదు.అయితే అప్పటి వరకూ అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెను విషాదం చోటు చేసుకుంది.
వరుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.
అంతేగాకుండా తన అకౌంట్ లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అవ్వడంతో విషయం తెలుసుకున్న సంధ్య దగ్గర ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు తెలియజేసింది.
దీంతో పోలీసులు ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం అటువంటి పరిస్థితులలో ముక్కు, మొహం తెలియని వాళ్ళకి ఖాతాలలో డబ్బులు జమ చేయడం మరియు ఇవ్వడం వంటివి చేయకూడదని సూచిస్తున్నారు.
.