ఫ్రాంక్‌ చేసినందుకు మల్లేశం స్టార్‌పై హైదరాబాదీ పోలీసులు గుస్సా  

Hyderabadi Police Angry On Mallesham Movie Star-

ఈమద్య కాలంలో సినిమాలను ప్రమోట్‌ చేసుకునేందుకు అనేక మార్గాలను వెదుకుతూ ఉన్నారు.సినిమా పబ్లిసిటీ అవ్వాలి అనే ఉద్దేశ్యంతో కొన్ని ఫ్రాంక్‌ వీడియోలను కూడా పెడుతున్నారు.ఇటీవలే ఒక నటి తన సినిమా ప్రమోషన్‌ కోసం అంటూ భర్త కనిపించకుండా పోయాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టింది.

Hyderabadi Police Angry On Mallesham Movie Star--Hyderabadi Police Angry On Mallesham Movie Star-

ఆమె పోస్ట్‌కు యమ స్పందన వచ్చింది.దాంతో వెంటనే ఆ వీడియో ఫ్రాంక్‌ అని, సినిమా ప్రమోషన్‌ కోసం అంటూ చెప్పగానే అంతా కూడా తీవ్ర విమర్శలు చేశారు.

Hyderabadi Police Angry On Mallesham Movie Star--Hyderabadi Police Angry On Mallesham Movie Star-

ఇప్పుడు అచ్చు అలాగే తెలుగు కమెడియన్‌ కమ్‌ హీరో ప్రియదర్శి ఒక ఫ్రాంక్‌ చేసి వివాదాస్పదం అయ్యాడు.తన స్నేహితుడు సందీప్‌ కిషన్‌ సినిమా నిను వీడని నీడను నేనే ప్రమోషన్‌ కోసం అంటూ ఒక వీడియోను పోస్ట్‌ చేశాడు.

ఆ వీడియోలో తన ఖరీదైన బైక్‌ పోయిందని, నా బైక్‌ను దొబ్బుకు వెళ్లిన వాడు ఒక అన్‌ ప్రొఫెషనల్‌ దొంగ అయ్యి ఉంటాడు అంటూ కూడా కామెంట్స్‌ చేశాడు.దాంతో ప్రియదర్శి బైక్‌ పోయిన విషయం సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌ అయ్యింది.

ఈ విషయం వైరల్‌ అవ్వడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.ప్రియదర్శి బైక్‌ పోయిన విషయంను ఏ స్టేషన్‌లో నమోదు చేయకపోవడంపై ఆయన్ను ప్రశ్నించారు.దాంతో వెంటనే వీడియోను డిలీట్‌ చేసి తాను ఫ్రాంక్‌ చేసినట్లుగా వివరణ ఇచ్చాడు.

దాంతో పోలీసులు ఇలాంటి సిల్లీ విషయాలు చేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట.ఇలాంటివి మళ్లీ రిపీట్‌ అయితే న్యూసెన్స్‌ కేసు బుక్‌ చేస్తామని కూడా హెచ్చరించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.