హైదరాబాదీ ఆటగాడి ఒంటరి పోరాటం.. థామస్ కప్‌లో భారత్ సంచలనం

సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది.బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పురుషుల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది.

 Hyderabadi Player Fights Alone India Sensation In Thomas Cup , Hyderabad Player-TeluguStop.com

క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచులతో బిజీగా ఉంటే, భారత బ్యాడ్మింటన్ జట్టు… థామస్ కప్‌ 2022 టోర్నీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.తద్వారా 73 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత పురుషుల జట్టు తొలిసారి ఫైనల్ కు దూసుకెళ్లింది.

అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు అంచనాలకు అనుగుణంగా రాణించింది.గతంలో సాధ్యంకాని ఘనతను ఈసారి సొంతం చేసుకుంది.

బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టీమ్‌ ఈవెంట్‌ అయిన థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టు తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది.కిడాంబి శ్రీకాంత్ సారథ్యంలోని భారత బ్యాడ్మింటన్ జట్టు, డెన్మార్క్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 3-2 తేడాతో విజయం అందుకుని, 73 ఏళ్లలో తొలిసారి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

1979 తర్వాత భారత జట్టు ఇప్పటి వరకు సెమీస్‌కు కూడా చేరలేదు.ఈసారి ఏకంగా ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.

ఈసారి కూడా హెచ్ఎస్ ప్రణయ్ మ్యాచ్ కీలకంగా మారింది. 2-2 తేడాతో స్కోర్లు సమంగా ఉన్న సమయంలో హెచ్‌ఎస్ ప్రణయ్, డెన్మార్క్ ప్లేయర్ రస్మస్ జెమ్కేని 13-21, 21-9, 21-12 తేడాతో వరుస సెట్లలో ఓడించి… భారత జట్టుకి అద్భుత విజయం అందించాడు.

మొదటి సెట్‌లో ఓడిన తర్వాత ప్రణయ్, వరుసగా రెండు సెట్లు గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చిన ప్రణయ్… భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు మార్గం సుగమం చేశాడు.ఆదివారం జరగనున్న స్వర్ణ పతక పోరులో డిఫెండింగ్ చాంపియన్, 14సార్లు విజేత అయిన ఇండోనేషియాతో భారత్ తలపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube