వంటలక్క అవతారం ఎత్తిన శ్రీరెడ్డి

తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఇష్యూతో ఒక్కసారిగా సంచలనంగా మారిన నటి శ్రీరెడ్డి.ఇండస్ట్రీలో పెద్దల మీద లైంగిక ఆరోపణలు చేయడమే కాకుండా కొన్నింటికి ఆధారాలు కూడా చూపించింది.

 Hyderabadi Biryani Srireddy-TeluguStop.com

అయితే ఆ సంఘటనలోనే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా తిట్టడంతో ఆమె మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగిపోయి మరింత పాపులర్ అయిపొయింది.ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయిన ఈ చిన్నది అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మీద దారుణమైన విమర్శలతో వీడియోలు పోస్ట్ చేస్తూ హడావిడి చేస్తుంది.

దీంతో మీడియాలో నిత్యం శ్రీరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంటుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం కాస్తా తగ్గించి కొత్త వ్యాపారం మొదలెట్టింది.

తన పాపులారిటీని కాష్ చేసుకోవడానికి సొంతంగా ఒక యుట్యూబ్ చానల్ పెట్టింది.ఈ చానల్ ద్వారా ఇప్పుడు శ్రీరెడ్డి చక్కగా చీర కట్టుకొని వంటలక్కగా మారిపోయింది.తనకి తెలిసిన వంటలని ప్రిపేర్ చేస్తూ వాటిని షూట్ చేసి యుట్యూబ్ లో పోస్ట్ చేస్తుంది.ఆమెకున్న పాపులారిటీకి ఈ వంటల వీడియోలకి లక్షల వ్యూస్ వస్తున్నాయి.

దీంతో ఈ చానల్ ద్వారా ఆదాయం కూడా వస్తుంది.మొత్తానికి ఇన్ని రోజులు కాంట్రవర్సీలతో క్రేజ్ పెంచుకున్న శ్రీరెడ్డి ఇలా పద్దతైన అమ్మాయిగా మారిపోయి సోషల్ మీడియా ప్రేక్షకులకి తన కమ్మని వంటలతో కాస్తా కాలక్షేపం అందించడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube