ప్రమాదంలో హైదరాబాద్ ఆరోగ్యం

హైదరాబాద్ ని ఫుడ్ సిటీ అని అంటారు.అలా ఎందుకు అంటారో మనకు తెలియని విషయం కాదు.

 Hyderabad Youth At Huge Risk Of Heart Diseases – Study-TeluguStop.com

మన తెలంగాణ రాజధాని భోజనప్రియులకు స్వర్గం లాంటిది.హైదరాబాద్ బిర్యాని, హైదరాబాద్ హలీమ్, హైదరాబాద్ మండీ, ఇలా చెప్పుకుంటేపోతే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వంటకాలెన్నిటికో హైదరాబాద్ ఫేమస్.

అర్థరాత్రి కూడా తెరచుకోని ఉండే రెస్టారెంట్లు ఉంటాయి.వంద రూపాయలకి కూడా మరో నగరంలో దొరకని రుచికరమైన బిర్యాని దొరికేస్తుంది.

వెజ్ – నాన్ వెజ్ తేడా లేకుండా గల్లి గల్లికి ఏదో ఒక తిండి పదార్థం లభిస్తుంది.అందుకే ఇక్కడివారు భోజనప్రియులు.

కాని ఇక్కడే ఓ ప్రమాదం వచ్చిపడింది.

ఇలా హద్దు అదుపులు లేని తిండి వల్ల హైదరాబాద్ వాసులు గుండె సంబంధత వ్యాధులతో పాటు డయాబెటిస్ రిస్క్ ని ఎక్కువగా చూడాల్సివస్తోందట.

యూనియన్‌ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆండ్ ఫ్యామిలి వెల్ఫేర్ మరియు పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో భయానకమైన విషయాలు బయటపడ్డాయి.

ఆ సర్వే ప్రకారం 18 ఏళ్ళు దాటిన హైదరాబాద్ యువతలో 15.90% శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో, 6.40% యువత డయాబెటిస్ తో బాధపడుతున్నారట.ఈ పరిస్థితికి కారణం హైదరాబాద్ లో దొరికే విపరీతమైన తిండే అంట.వేలకు వేలు వెరైటీలు కనబడేసరికి యువత బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ గురించి ఆలోచించకుండా అవసరానికి మించి బయటితిండి తింటున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి సెక్రటెరీ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube