మహిళ కొంప ముంచిన గూగుల్ సెర్చ్.. దారుణమైన మోసం.. ?

మేము మారం మా బ్రతుకులు ఇంతే అన్నవారిని చూస్తుంటే వీరికి పిచ్చిగానీ పట్టిందా అనిపిస్తుంది.ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.

 Hyderabad Women Searched On Google For Amazon Customer Care Number Lose Of Rs 3 Lakhs-TeluguStop.com

ఒక వైపు పోలీసులు ప్రజలను మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంటే, మరో వైపు సోషల్ మీడియాలో మోసగాళ్ల గురించి తీవ్రంగా ప్రచారం జరుగుతుంటే కనీస అవగహన కల్పించుకోలేక పోతున్నారు ప్రజలు.దీని ఫలితంగా డబ్బులు కోల్పోయి లబోదిబో అంటూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.ఇలాగే చేసిన ఒక మహిళ తన అజ్ఞానంతో ఏకంగా రూ.3.15 లక్షలు పొగొట్టుకుంది.ఆ వివరాలు చూస్తే.

హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ మహిళ అమెజాన్‌లో ఒక వస్తువు ఆర్డర్ చేసిందట.అదికాస్త లేటు కావడంతో అమెజాన్ కస్టమర్ కేర్‌కు కాల్ చేద్దామని భావించి గూగుల్లో ఆ నెంబర్ కోసం సెర్చ్‌ చేసిందట.

 Hyderabad Women Searched On Google For Amazon Customer Care Number Lose Of Rs 3 Lakhs-మహిళ కొంప ముంచిన గూగుల్ సెర్చ్.. దారుణమైన మోసం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడ ఒక నంబర్ కనిపించగా దానికి కాల్ చేసి తన ఆర్డర్ వివరాలను వెల్లడించగా అటువైపు ఉన్న వ్యక్తి అమెజాన్ కస్టమర్ కేర్‌ సెంటర్ వ్యక్తిగా మాట్లాడి మేడం స్టాక్ లేకపోవడంతో ఆర్డర్ లేట్ అయిందని తెలిపాడట.

అదీగాక మీడబ్బులు మీకు చెల్లిస్తాం ఇందుకు మేము పంపించే ఓ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని సూచించాడట.

అది నిజమేనని నమ్మిన ఆ మహిళ క్యూఆర్ కోడ్ ‌ను స్కాన్ చేసింది.దీంతో క్షణాల్లో ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.3.15 లక్షలు డెబిట్ అయ్యాయట.ఇక విషయాన్ని పసిగట్టిన ఆ మహిళ తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

#AmazonCustomer #Rs 3 Lakhs #Hyderabad #Women #Lose

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు