సౌదీలో మరణించిన హైదరాబాద్ మహిళ       2018-06-13   03:48:54  IST  Bhanu C

ఎన్నారైలకి ఆడపిల్లల్ని ఇవ్వాలంటే ఆడపిల్లల తల్లితండ్రులు ఎంతో భయపడుతున్నారు..ఒకానొక సమయంలో ఎన్నారై సంభందం అంటే ఎంతో ఆసక్తి కనబరిచిన వాళ్ళు ఇప్పుడు వారి పేరు చెప్తే చాలు మాకు వద్దు ఎన్నారై అల్లుళ్ళు అంటున్నారు..ఈ పరిస్థితి కొన్ని ఏళ్ళ ముందు ఉండేది అయితే అప్పట్లో ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్న ఎన్నారైల పై అక్కడి ప్రభుత్వాలు…భారత ప్రభుత్వం ఖటినమైన చర్యలు తీసుకోవడంతో నేరాలు తగ్గిపోయాయి..

అయితే మళ్ళీ ఎన్నారై అల్లుళ్ళు బారి తెగిస్తున్నారు అనడానికి తాజా ఉదాహరణే నిదర్సనం అవుతోంది..తమ అల్లుడిపై చర్యలు తీసుకోండి అంటూ ఒక మహిళా తల్లి తండ్రులు భారత ప్రభుత్వానికి లేఖని రాశారు.. వివరాలలో కి వెళ్తే.మహ్మద్‌ ఉమర్‌ అనే వ్యక్తి సౌదీ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు..అక్కడ మెకానిక్ అయిన ఉమర్ కి 2014లో తహసీన్‌ తో వివాహం జరిగింది..అయితే వీసాల విషయంలో ఇరు కుటుంభాలకి గొడవలు అవుతూనే ఉన్నాయి అయితే మధ్యలో భార్యా భర్తలకి మధ్య కూడా విభేదాలు మొదలయ్యాయి.

హైదరాబాద్‌లో అత్త, మామ ఇబ్బంది పెడుతున్నారని, తనని సౌదీకి తీసుకువెళ్ళమని తహసీన్‌ తన భర్తపై ఒత్తిడి చేయడంతో విజిటింగ్ వీసాపై పిలిపించుకున్నాడు. వీసాను 3 నెలలకు ఒకసారి రెన్యూవల్‌ చేస్తూ భార్యను ఉమర్‌ తన వద్దే ఉంచుకున్నాడు…అయితే ..విజిటింగ్‌ వీసాపై మూడోసారి సౌదీ వెళ్ళిన తహసీన్‌ ఇటీవల ఆక్కడ ఆత్మహత్య చేసుకుంది..అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే వివరాలు మాత్రం తెలియరాలేదు

అయితే ఈ క్రమంలోనే ఉమర్‌ కూడా చేతి నరాలు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు…అల్లుడి వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె భర్తను కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు సౌదీలోని భారతీయ రాయబార కార్యాలయానికి లేఖ రాశారు..ఈ విషయంపై స్పందించిన తెలంగాణా ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి చర్యలకి సిఫార్స్ చేస్తామని తెలిపింది.