అఖండపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రసంశలు!

నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సినిమా ‘అఖండ’. ఈ సినిమాతో మరొకసారి ఈ కాంబో సూపర్ హిట్ అందుకుంది.

 Hyderabad Traffic Police Praise Akhanda Balakrishna Movie Details, Akhanda, Hyde-TeluguStop.com

బోయపాటి, బాలయ్య ఇంతకు ముందు చేసిన సింహ, లెజెండ్ సినిమాల కంటే కూడా ఈ సినిమా మరింత హిట్ సాధించి వీళ్ళ కాంబోకు తిరుగులేదు అని మరోసారి నిరూపించారు.

చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమా భారీ విజయం సాధించడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో కనిపించి ప్రేక్షకుల చేత వావ్ అనిపించు కున్నాడు.ఇంకా ఈ సినిమా విజయంలో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది.

తమన్ అందించిన పాటలు, బీజీఎమ్ సినిమాకు ప్లస్ అయ్యాయనే చెప్పాలి.

ఈ సినిమా ఇప్పటికే పలువురి చేత ప్రశంసలు అందుకుని మరొకొన్ని రికార్డులు కూడా నెలకొల్పింది.

తాజాగా ఈ సినిమాపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం ప్రసంశలు కురిపించారు.ఈ సినిమా ద్వారా రోడ్డు భద్రతను ప్రోత్సహించినందుకు బాలకృష్ణకు, డైరెక్టర్ బోయపాటి తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ధన్యవాదములు తెలిపారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అఖండ సినిమాలో హీరో బాలయ్య, ప్రగ్యా జైశ్వాల్ ఇద్దరు కారులో వెళ్లే ఒక సీన్ ను పోలీసులు ట్యాగ్ చేస్తుంటే ట్వీట్ చేసారు.ఈ సీన్ లో బాలయ్య, ప్రగ్యా ఇద్దరు సీట్ బెల్టు పెట్టుకుని ఉంటారు.”కారు సీట్ బెల్ట్ ధరించి ఎంత దూరం అయినా, ఎవరి కారులో అయినా సరే ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించండి” అంటూ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్వీట్ లో పేర్కొన్నారు.అలాగే ప్రజలందరూ సీట్ బెల్టును ఎల్లప్పుడూ తప్పనిసరిగా ధరించండి అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube