ఇకపై వాట్సాప్ లోనే ట్రాఫిక్ చలాన్ వివరాలు... ఎలాగంటే..??

ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తారానే విషయం అందరికి తెలిసిందే.అయితే చాలామంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా తమ ఇష్టానుసారంగా రూల్స్ ను అతిక్రమిస్తున్నారు.

 Hyderabad Traffic Police Can Now Message Traffic Challans To Whatsapp Number Det-TeluguStop.com

ఫలితంగా చాలా చలానాలను చెల్లించవలిసిన పరిస్థితి వస్తుంది.అయితే ఈ చలానాల విషయంలో హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు ఒక సరికొత్త టెక్నాలజీని వాడాలని నిర్ణయించారు.

ఈ సరికొత్త విధానంలో భాగంగా వాహనదారులు ఇకపై తమ వాహనాలకు సంబంధించిన చలానాలకు సంబంధించిన అప్ డేట్స్ ను నేరుగా తమ వాట్సాప్ కు మెసేజెస్ రూపంలో వస్తాయి.

వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వాహనదారులు తమ చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఇవ్వవలిసి ఉంటుంది.

అలా వాహనదారులు ఇచ్చిన మెుబైల్ నంబర్ కు ఈ-చలాన్ వివరాలను పోలీసులు మెసేజ్ చేస్తారు.గతంలో తమ వాహనాలకు సంబందించిన వివరాలు తెలుసుకోవటానికి పోలీసు ఈ-చలాన్ పోర్టల్ లో చెక్ చేసుకోవలసి వచ్చేంది.

కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేరుగా తమ వాహనానికి సంబంధించిన వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.ఫలితంగా వాహనాల చలానాలు పెండింగ్ లేకుండా వెంటనే చెల్లించవచ్చు.

అలాగే ఈ చెల్లింపులను ఆన్ లైన్లో లేదా మీసేవలో గాని చెల్లించవచ్చు.

Telugu Cyber, Challans, Hyderabad, Fine, Vehicles, Whatsapp, Whatsapp Number-Lat

ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఈ-చలాన్ విభాగంలోని పోలీసుల బృందం ప్రతి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఈ-చలాన్ పోర్టల్‌లో ట్రాఫిక్ జరిమానాల ఇన్ఫర్మేషన్ ను అప్‌డేట్ చేస్తుంది.తద్వారా వాహన యజమాని మొబైల్ ఫోన్‌కు ముందుగా చలాన్ వివరాలతో కూడిన మెసేజ్ పంపడం జరుగుతుంది.ఇదిలా ఉండగా ఇప్పటికే వసూలు కావలసిన ట్రాఫిక్ చలాన్ల సొమ్మును తిరిగి రికవరీ చేసేందుకు స్పెషల్ డ్రైవ్స్ తో, వాహనదారులకు భారీ మెుత్తంలో డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తోంది.

వాట్సాప్ లో వాహనాల చలానా వివరాలు ఫార్వార్డ్ చేయడం ద్వారా వాహనదారులు తమ వాహనం మీద ఉన్న ఫైన్స్ తెలుసుకోవడం ఇకపై చాలా సులభతరం అవుతున్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube