హైదరాబాద్ విద్యార్ధుల రికార్డు

తెలుగు వారి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ విద్యార్ధులు ఇండియాలోనే రికార్డు సృష్టించారు.ఆటల్లోనా? పాటల్లోనా ? కాదు.అమెరికా వీసాలు పొందడంలో హైదరాబాదీయులు ఘనతను సాధించారు.ఏమిటి ఆ ఘనత అంటే ….స్టూడెంట్ వీసాలు పొందడంలో హైదరాబాద్ ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది.ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది.

 Hyderabad Tops In Us Student Visas-TeluguStop.com

హెచ్ 1 బీ వీసాల విషయంలో హైదరాబాద్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది.నగరం నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళే విద్యార్ధుల సంఖ్య బాగా పెరిగింది.గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూలై నాటికి అమెరికా వెళ్ళే విద్యార్ధుల సంఖ్య 31.98 శాతం పెరిగింది.అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక మంది విద్యార్ధులు చదువుతున్నారు.గతం కంటే ఈ ఏడాది వీసా దరఖాస్తుల సంఖ్య 51 శాతం పెరిగింది.

ఈ 51 శాతంలో 40 శాతం అప్లికేషన్లు హైదరాబాద్ విద్యార్ధులవే.సో … ఈ గణాంకాల బట్టి చూస్తే అమెరికా చదువుల మీద మోజు విపరీతంగా ఉందని అర్థం అవుతున్నది.

ఇంతమంది అమెరికాకు పరుగులు తీస్తున్నారంటే మన విశ్వవిద్యాలయాలు ఎంత బాగున్నాయో తెలుస్తోంది.తెలంగాణలోనే ఇప్పటివరకు అనేక విశ్వవిద్యాలయాలకు వీసీలు లేరు.

ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.ఉస్మానియా పరిస్తితి ఘోరంగా ఉందని ఈమధ్య మీడియాలో కధనాలు వచ్చాయి.

ప్రమాణాలు, వసతులు లేని మన విశ్వవిద్యాలయాలలో ఎందుకు చదువుతారు?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube