హైదరాబాద్ కుర్రాడికి అమెరికన్ వర్సిటీ స్కాలర్..ఎన్ని కోట్లో తెలుసా...!!!

భారతీయ విద్యార్ధులకు అగ్రరాజ్యం రెడ్ కార్పెట్ పరుస్తుందనే విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం అమెరికా అగ్ర స్థానంలో ఉందంటే అందులో మెజారిటీ క్రెడిట్ భారతీయులదేనని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.

 Hyderabad Student Gets Rs 1 Cr Scholarship From Us University,us,america,hyderabad,vedant Anandwade,case Western Reserve University,pre-med In Neuroscience And Psychology,17 Nobel Laureates,unesco-TeluguStop.com

ఎంతో మంది భారతీయ విద్యార్ధులు అమెరికా వెళ్లి చదువుకుని అక్కడే స్థిరపడి మనదైన ప్రతిభాపాటవాలతో అమెరికాను అభివృద్ధి పదంలో నడిపించిన వారిలో ఒకరిగా నిలిచారు.అందుకే

భారతీయ విధ్యార్ధులు అమెరికాలో చదువుకునేందుకు వారికి ప్రోశ్చాహకాలు అందిస్తూ, వీసా విషయంలో ఎలాంటి అభ్యంతరాలు తెలుపకుండా ఉన్నత చదువుల కోసం అమెరికాకు ఆహ్వానిస్తోంది.

 Hyderabad Student Gets Rs 1 Cr Scholarship From US University,US,America,Hyderabad,Vedant Anandwade,Case Western Reserve University,Pre-med In Neuroscience And Psychology,17 Nobel Laureates,UNESCO -హైదరాబాద్ కుర్రాడికి అమెరికన్ వర్సిటీ స్కాలర్..ఎన్ని కోట్లో తెలుసా#8230;-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారత్ లో ఉన్న ప్రతిభ గల వారిని కాచి వడపోసి మరీ తమ దేశానికి ఎగరేసుకుపోవడంలో అమెరిక సక్సెస్ అవుతోందనే చెప్పాలి.అక్కడి టాప్ వర్సిటీలు నిర్వహించే ప్రతిభా పోటీలలో ఉత్తీర్ణులు అయిన వారికి ఉపకార వేతనాలు ఇవ్వడమే కాకుండా వారికి చెందిన అన్ని ఖర్చులు ఆయా వర్సిటీలే భరిస్తుంటాయి.

ప్రతీ ఏటా నిర్వహించే ఈ పోటీ పరీక్షలలో భారతీయ విద్యార్ధులు ఎన్నికవుతూనే ఉంటారు.తాజాగా

Telugu Nobel Laureates, America, Western Reserve, Hyderabad, Preneuroscience, Unesco-Telugu NRI

హైదరాబాద్ కి చెందిన వేదాంత్ అనే విద్యార్ధి కి అమెరికాలో ప్రఖ్యాత వర్సిటీ రూ.1.30 కోట్ల స్కాలర్ షిప్ ఆఫర్ చేస్తూ తమ దేశానికి వచ్చేయమని, అన్ని ఖర్చులు తామే భరిస్తామని తెలిపింది.హైదరాబాద్ లోని ఓ ప్రవైటు స్కూల్ లో 12 తరగతి చదివిన వేదాంత్ ఇప్పుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లనున్నాడు.అక్కడ కేస్ వెస్ట్రన్ రిజర్వ్ వర్సిటీలో బ్యాచలర్ డిగ్రీ చదవనున్నాడు.

వర్సిటీ ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ వర్సిటీకి 16వ ర్యాంక్ ఉంది.సుమారు 17 మంది నోబెల్స్ సంపాదించిన వాళ్ళు ఈ వర్సిటీకి చెందిన వాళ్ళు కావడం గమనార్హం.

అలాంటి వర్సిటీలో వేదాంత్ న్యూరో సైన్స్ చదవనున్నాడు.కాగా వేదాంత్ తల్లి తండ్రులు ఇద్దరూ వైద్యులు కావడం గమనార్హం.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube