మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య  

Hyderabad Rtc Worker Sucide In Today-rtc Worker,srinivas Reddy In Khammam,surender Goud

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె తీవ్రతరం అయ్యింది.సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగస్తులను తొలగించినట్లుగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను మరింత ఉదృతం చేశారు.కొత్త నియామకాల కోసం ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేసింది.ఈ సమయంలోనే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఖమ్మంకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే ఆర్టీసీ కార్మికుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం మర్చి పోకముందే మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad Rtc Worker Sucide In Today-rtc Worker,srinivas Reddy In Khammam,surender Goud-Hyderabad RTC Worker Sucide In Today-Rtc Srinivas Reddy Khammam Surender Goud

హైదరాబాద్‌ రాణీగంజ్‌కు చెందిన ఆర్టీసీ కార్మికుడు సురేందర్‌ గౌడ్‌ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.జీతం రాకపోవడంతో లోన్‌ అమౌంట్‌ కట్ట లేక చెక్‌ బౌన్స్‌ అయ్యింది.దాంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఇద్దరి ఆత్మహత్యలతో ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను తీవ్ర తరం చేస్తున్నారు.మరో వైపు ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను వీడి ప్రభుత్వంతో చర్చలకు దిగితే బెటర్‌ అంటూ సామాన్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad Rtc Worker Sucide In Today-rtc Worker,srinivas Reddy In Khammam,surender Goud-Hyderabad RTC Worker Sucide In Today-Rtc Srinivas Reddy Khammam Surender Goud

మొత్తానికి ఆర్టీసీ కార్మికులు 48 వేల మంది దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.