వాళ్ళకు కరోనా అంటే భయమే లేదు.. వందలాది మందితో పెళ్లి రిసెప్షన్

కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజుకు కొన్ని వేలమంది కరోనా బారిన పడుతున్నారు.

 150 Members Attended To Reception In Hyderabad,hyderabad, Reception,  Corona Eff-TeluguStop.com

లాక్ డౌన్ కారణంగా కాస్త అయినా కరోనా తగ్గింది కానీ.లేకుంటే మన దేశమే ఫస్ట్ ఉండేది.

లాక్ డౌన్ ఉన్నప్పటికీ లక్షమంది కరోనా బారిన పడ్డారు అంటే మాములు విషయం కాదు.ఇంకా అలాంటి కరోనా వైరస్ కి భయపడి గత 56 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుంది.

ఇప్పుడిప్పుడే కాస్త సడలింపు ఇస్తున్నారు.ఇప్పుడే రోడ్లపైకి జనాలు వస్తున్నారు.సాధారణంగా అయితే నిన్నటి వరుకు కూడా ఎవరు బయటకు రాలేదు.అయితే ఇంకా పెళ్లిళ్లు కూడా సదా సీదాగా జరిగిపోయాయి.

సెలబ్రెటీల పెళ్లి సైతం సాధారణంగా జరిగింది.దిల్ రాజు, నిఖిల్, జబర్దస్ మహేష్ ఇలా అందరి పెళ్లిళ్లు చాలా సాధారణంగా అతి తక్కువ మందితో పెళ్లిళ్లు జరిగాయి.

అయితే హైదరాబాద్ లో మాత్రం ఓ ఇంట పెళ్లి కాదు రిసెప్షన్ కొన్ని వందలాది మందితో జరిగింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందలాది మందితో ఏ వేడుకలు చేసుకోవద్దు అని ఎంత చెప్పిన సరే వాళ్ళు పెడచెవిన పెట్టారు.

ఇంకేముంది.తాజాగా హైదరాబాద్ నగరంలోని జగదాంబ నగర్ లో ఓ ఫర్నిచర్ వ్యాపారి ఇంట్లో పెళ్లి రిసెప్షన్ జరిగింది.

ఈ వేడుకకు ఒకరు కాదు.ఇద్దరు కాదు ఏకంగా 150మందికిపైగా హజరయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించిన ఫర్నిచర్ వ్యాపారితో పాటు అయన కుమారుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube