హైదరాబాద్‌ సైకాలజిస్ట్‌కు అరుదైన గౌరవం: అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్‌లో మెంబర్‌షిప్

హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ పి.జవహర్‌లాల్ నెహ్రూకు అరుదైన గుర్తింపు లభించింది.

 Hyderabad Psychologist Has Been Selected As A Member Of Apa Member-TeluguStop.com

ఆయనకు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ సభ్యత్వం లభించింది.

ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సంద్రాసల్మాన్ ఇంటర్నేషనల్ అఫిలియేటెడ్ మెంబర్ 2020 గా ఎంపికైన ధ్రువీకరణ పత్రాన్ని పంపినట్లుగా నెహ్రూ తెలిపారు.

దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనేందుకు అర్హత లభించిందని, అంతర్జాతీయ జర్నల్స్‌కు పరిశోధనాపత్రాలను పంపించే అవకాశం ఎంతో ఆనందంగా ఉందని నెహ్రూ వెల్లడించారు.అలాగే సైకాలజీలో అనేక కొత్త విషయాలను ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లి పరిశీలించేందుకు తనకు అవకాశం లభించిందని డాక్టర్ జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నారు.

127 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్‌ ఏపీఏ అమెరికాలో అతిపెద్ద మనస్తత్వ వేత్తల సంస్థ, ఇందులో సుమారు 1,18,000 మంది సభ్యులు ఉన్నారు.వీరిలో శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఆసుపత్రులు, కన్సల్టెంట్లు, విద్యార్ధులు ఉన్నారు.

వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో సైకాలజీలోని 54 విభాగాలకు చెందిన వారు తమ సేవలు అందిస్తున్నారు.

ఏపీఏ విధులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రతి ఏటా 115 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించుకుంటుంది.

మానసిక శాస్త్రంలో ఏపీఏ చేస్తున్న కృషికి గాను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి.అలాగే ప్రతి ఏడు మానసిక శాస్త్రంలో వస్తున్న మార్పులు, ఇతర సాంకేతిక అభివృద్దిపై జర్నల్స్‌ను ప్రచురిస్తోంది.1892లో క్లార్క్ యూనివర్సిటీకి చెందిన 30 మంది సభ్యులతో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రారంభమై నేడు ఈ స్థాయికి వృద్ది చెందడం ఆ సంస్థ సాధించిన ప్రగతికి నిదర్శనం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube