దెబ్బకు ‘ఠా’ .. దొంగల ముఠా

Hyderabad Polie 12 Bike Thieves Arresed

నగరంలో దొంగతనాలు చేసి వేరే జిల్లాల్లో బైకులను అమ్ముతున్న మూడు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు.వాళ్ల కంటికి కనిపించే బైక్ లను కొట్టేసి క్యాష్ చేసుకుంటున్నారు.పోలీసులు వీరి దగ్గరి నుంచి రూ.1.25 కోట్ల విలువైన 77 బైకులను స్వాధీన పర్చుకున్నారు.

 Hyderabad Polie 12 Bike Thieves Arresed-TeluguStop.com

నగరంలోని పాతబస్తీ, సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మొహిసిన్, అమీనుల్లా ముఠాలుగా ఏర్పడి దొంగతనానికి పాల్పడుతున్నారు.

వేరే జిల్లాలో పరిచయాలు పెంచుకుని గుర్తు తెలియకుండా బైక్ లను అమ్మేస్తున్నారు.వీరికి నిజామాబాద్ లో అక్బర్, అస్గర్ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది.వీరితో బైక్ కు రూ.15 నుంచి 20 వేలకు ఒప్పందం కుదర్చుకుని చోరి వాహనాలను నిజామాబాద్ కు తరలించేవారు.హైదరాబాద్ నుంచి వాహనాలు చోరీ చేసి హిందుస్థాన్ పార్సిల్ సర్వీస్ ద్వారా నిజామాబాద్ కు పంపించేవారు.ఇలా ఆరు నెలల్లో సుమారు 150 వాహనాలను తరలించారు.

 Hyderabad Polie 12 Bike Thieves Arresed-దెబ్బకు ‘ఠా’ .. దొంగల ముఠా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీళ్ల గుట్టు రట్టు అవ్వడానికి ఇటీవల ఓ వ్యక్తి బైక్ పోయిందని కార్ఖానా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమే.దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించగా పాత నేరస్థుడు మొహిసిన్ కనిపించాడు.

ప్రత్యేక టీంగా ఏర్పడి పోలీసులు కేసును పూర్తిగా పరిశీలించి మొహిసిన్ తో పాటు మహ్మద్ ఆదిల్, అహ్మద్, సైఫ్, ఒవైస్, మహ్మద్ గౌస్, హసన్ బిన్ లను అరెస్ట్ చేశారు.వారి నుంచి 15 బైకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఈ మేరకు మూడు ముఠాలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

#CCTVCamera #Hyderabad Bike #Karkhana #Nizmabad #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube