హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీల వ్యాపారం! ఒక్కో కిడ్నీ ఖరీదు ఎంతో తెలుసా  

Hyderabad Police Bust International Kidney Transplantation Racket-

మారిన కాలంతో పాటు మనిషి ఆలోచనలు ఎంత క్రూరంగా మారుతున్నాయో సమాజంలో జరుగుతున్నా కొన్ని సంఘటనలు రుజువు చేస్తూ ఉంటాయి.మనిషి ఇంతగా దిగాజారిపోయాడా అని అలాంటి ఘటనలు గురించి తెలిసినపుడు విచారించాల్సిన పరిస్థితి వస్తుంది.

Hyderabad Police Bust International Kidney Transplantation Racket-

హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మానవ ఆక్రమణ చేసే దేశాల జాబితాలో ఇండియా కూడా ఒకటిగా ఉండటం కాస్తా బాధపడాల్సిన విషయం.

కనీసం మానవత్వం లేకుండా చిన్న పిల్లలని, అమ్మాయిలని కిడ్నాప్ చేసి విదేశాలకి అమ్మేసే గ్యాంగ్ లకి దేశంలో కొదవే లేదు.

ఇక మానవ అవయవాలతో కూడా వ్యాపారం చేసే ప్రబుద్ధులు మన దేశంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ఇంకా చెప్పాలంటే ఇలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అవయావాల వ్యాపారానికి హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది.దేశంలో జరిగే చాలా అరాచకాలకి హైదరాబాద్ కూడా అడ్డాగా మారిపోయింది.

డ్రగ్స్ మాఫియా నుంచి హవాలా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న భారీ కిడ్నీ మాఫియా ఒకటి బయటపడింది.ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో కిడ్నీల బిజినెస్‌ చేస్తున్నారు.ఒప్పందం ప్రకారం డబ్బులివ్వకపోవడంతో ఓ బాధితుడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు.వారి తీగలాగడంతో ఈ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టయింది.

ఆర్ధిక సమస్యలతో కిడ్నీలు అమ్ముకోవడానికి కొంత మంది దివుగా మధ్యతరగతి ప్రజలు సిద్ధం అవుతూ ఉంటారు.ఇలాంటి వారు తెలంగాణలో ఎక్కువగా ఉంటారు.వారిని టార్గెట్ గా చేసుకొని ఈ ముఠా భారీగా డబ్బులు ఆశ చూపించి మోసం చేస్తారు.

ఇటీవల ఓ బాధితుడు తన కిడ్నీ అలాగే అమ్ముకోగా ఇరవై లక్షలు చెప్పి కేవలం ఐదు లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు.దీంతో బాధితుడు పోలీసులని ఆశ్రయించగా, నిదితులు అడ్డంగా దొరికారు.వీరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి అంతర్జాతీయ స్థాయిలో వీరు చేసిన మోసాలని బయట పెట్టారు.

కేటుగాళ్లు 2013 నుంచి పదుల సంఖ్యలో కిడ్నీ మార్పిడిలు చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టారు.

తాజా వార్తలు

Hyderabad Police Bust International Kidney Transplantation Racket- Related....