హైదరాబాద్‌ అప్రమత్తం

దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దక్షిణ భారతంలో మొదటి చూపు హైదరాబాద్‌ మీదనే పడుతుంది.ఉగ్రవాదులు దేశంలో ఎక్కడ దాడులు చేసినా వారి మూలాలు హైదరాబాదులో ఉన్నాయేమోనని అనుమానం కలుగుతంది.

 Hyderabad On High Alert-TeluguStop.com

వారి కోసం నగరాన్ని జల్లెడ పడతారు.హైదరాబాద్‌ పలుమార్లు ఉగ్రదాడుల బారిన పడటమే ఇందుకు కారణం.

పాతబస్తీలో ముస్లిం జనాభా అధికంగా ఉండటం, అక్కడ కొందరు చట్టవిరుద్ధంగా నివసిస్తూవుండట, విదేశాల నుంచి కూడా అనేకమంది షేక్‌లు వస్తుండటం…ఇలాంటివన్నీ అనుమానాలకు కారణమవుతున్నాయి.తాజాగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదులు దాడులు చేశారు.

వెంటనే హైదరాబాదులో హైఅలర్‌్ట ప్రకటించారు.తనిఖీలు చేస్తుతన్నారు.

అణువణువూ గాలిస్తున్నారు.నగరం మధ్యలోని బేగంపేట విమానాశ్రయంతోపాటు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండుల్లో నిఘా పెంచారు.

ఇంతేకాకుండా వీఐపీల ఇళ్ల వద్ద, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.దేశంలో ఎక్కడ ఉగ్రదాడదులు జరిగినా హైదరాబాదీయులు ఉలిక్కిపడతారు.

ఎప్పుడు ఏం జరుగుతుందతోనని భయపడుతుంటారు.దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల తరువాత నగరం ఇప్పటివరకు ప్రశాంతంగానే ఉంది.

మధ్యలో వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కలకలం సృష్టించినా కొంతకాలం తరువాత సమసిపోయింది.ఇప్పుడు పంజాబ్‌లో ఉగ్రదాడులతో హైదరాబాద్‌ మరోసారి వార్తల్లోకెక్కింది.

గురుదాస్‌పూర్‌లో సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ముగ్గురు పోలీసు అధికారులు, ముగ్గురు పౌరులు చనిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube