అతని ప్రవర్తన భారతీయులందరికి అవమానం..అసలు ఎం జరిగిందంటే!  

Hyderabad Nri Behave Rudely With Women In Plane-indians,plane,women

ఇండియా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక గౌరవం ఉంది.భారతీయులు ఎవరినైనా గౌరవించి మాట్లాడుతారు.పొరపాటున కూడా వాళ్ళు ఇతరులతో దురుసుగా ప్రవర్తించారు అని అందరూ అనుకుంటారు.అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రతి భారతీయుడు తలదించుకునే విధంగా ఉంది.

Hyderabad Nri Behave Rudely With Women In Plane-indians,plane,women తెలుగు అవి ఇవి వింత తెలియని వాస్తవాలను మిస్టరీ విశేషాలు -Hyderabad Nri Behave Rudely With Women In Plane-Indians Plane

ఓ యువతీ టికెట్ బుక్ చేసుకొని విమానం ఎక్కి తన సీట్లో వేరే వ్యక్తి కూర్చొని ఉండటం గమనించి అది తన సీటని చెప్పింది.అయితే దానికి ఆగ్రహించిన సదరు హైదరబాదీ ఎన్నారై ఆమెను చెడామడా తిట్టేశాడు.

ఆమెని హేళన చేశాడు.తన టికెట్ చూపించిన ఆమెపొరబడినట్లు గ్రహించింది సారీ చెప్పి వెనక ఉన్న తన సీట్లో వెళ్లి కూర్చుంది.

ఆమెను తిట్టిన వ్యక్తి సీటును ముందుకూ, వెనక్కూ ఆడిస్తూ ఉండటంతో ఆమె కాస్తా అసహనానికి లోనయింది.అతని పేరు తెలియకపోవడంతో భుజం తట్టి పిలిచింది.దాంతో నన్నే టచ్ చేస్తావా… అంటూ ప్రయాణికులు అందరి ముందు ఆమెని ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు.ఆ విమానంలో విదేశీయులు ఎక్కువగా ఉన్నారు.

వారందరూ మహిళలకు భారతీయులు ఇచ్చే గౌరవం ఇదేనా అన్నట్లు చూశారు.ఇది అందరికీ తలవంపులు తెచ్చే ఘటన అని ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది.

దీంతో విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండవగానే ఎన్నారైని అదుపులోకి తీసుకున్న పోలీసులు లీగల్ విచారణ కోసం కనీసం 15 రోజులు భారత్‌లోనే ఉండాలని ఆదేశించారు.దీంతో ఇబ్బంది పడిన అతను తనదే తప్పని, ఏదో కోపంలో అలా చేశానని క్షమాపణ కోరాడు.

ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో ఎవరి పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.ఆ హైదరాబాదీ ఎన్నారైకి సంస్కారం లేదంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

తాజా వార్తలు