విషాదం: రైలు ఢీకొని కాబోయే దంపతులు మృతి....

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ చందానగర్  ప్రాంతంలో రైలు ఢీకొని కాబోయే నవ దంపతులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే స్థానిక  పాపిరెడ్డి నగర్ కి చెందినటువంటి మనోహర్ అనే యువకుడికి సోనీ అనే యువతితో వివాహం నిశ్చయం అయ్యి ఎంగేజ్మెంట్ కూడా అయింది.

 Hyderabad New Bride And Groom Manohar Sony-TeluguStop.com

అయితే వీరి పెళ్లి వచ్చే సంవత్సరం లోని ఫిబ్రవరి నెలలో జరిపించాలని పెద్దలు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో మనోహర్, సోనీ ఇద్దరూ కలిసి పెళ్లికి సంబంధించినటువంటి సామాన్లు కొనడానికి బయటికి వెళ్లారు.

ఇందులో భాగంగా చందానగర్ రైల్వే బ్రిడ్జి వద్ద పట్టాలు దాటుతుండగా వెనుక వైపు నుంచి వస్తున్న లోకల్ ఎంఎంటీఎస్ రైలుని గుర్తించక పోవడంతో వేగంగా వస్తున్న రైలు వారిని ఢీకొట్టింది.తీవ్ర రక్త రక్త స్రావానికి గురైనవారు అక్కడికక్కడే మృతి చెందారు.

రైలు పట్టాలు దాటే సమయంలో వెనకవైపు నుంచి వేగంగా వస్తున్న రైలుని గమనించకపోవడం తోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.వీరి  మరణవార్త విన్న కుటుంబ సభ్యులు తీవ్ర  విషాదానికి లోనయ్యారు.మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితం గడపాల్సిన నవ దంపతులు కాటికి వెళ్లారంటూ బంధువులు విలపిస్తున్నారు. 

.

#HyderabadLocal #Hyderabad #Sony #HyderabadCrime #HyderabadChanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు