ఈ ఏనుగు వయసు ఎంతో తెలుసా?

హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో నివసించే ఓ ఏనుగు రికార్డు సృష్టించింది.ఆ ఏనుగు మీకు కూడా తెలిసి ఉండచ్చు.

 Hyderabad's Nehru Zoological Park , Oldest Elephant , 82-year-old Rani, World El-TeluguStop.com

ఎందుకంటే ఆ ఏనుగు వయసు 82 ఏళ్లు.దాదాపు ఎంతోమంది ఈ ఏనుగును చూసి ఉంటారు.

ఆ ఏనుగు పేరు రాణి.ఇంకా ఎందులో రికార్డు సృష్టించింది అని మీకు సందేహం వచ్చిందా?

అదేనండి.వయసులో.సాధారణ ఏనుగుల జీవిత కాలం కంటే ఎక్కువ రోజులు అంటే 82 ఏళ్ళ వయసు వరకు బతికి రికార్డు సృష్టించింది.స్వాతంత్య్రానికి పూర్వం నుంచి నగర సందర్శకులను కనువిందు చేస్తున్న రాణికి ఎలిఫెంట్‌ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సన్మానం జరిగింది.
నిజానికి సాధారణ ఏనుగులు 50 నుంచి 60 సంవత్సరాల వరకు జీవిస్తుంది.

కానీ రాణి మాత్రం 80 ఏళ్లుగా జీవిస్తుంది.ఎక్కువ కాలం బతికిన ఏనుగులతో రాణి కూడా నిలిచింది.

రాణి 1938 అక్టోబర్ 7న జన్మించింది.ఈ ఏనుగును 1963లో బహుదూర్‌పురాలో నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ కు తరలించారు.

రాణి 82 ఏళ్ళ వయసు వచ్చాక ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం అరుదైన రికార్డు అని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube