విడ్డూరం : పోలీసులకే ఫైన్‌, ఇది మన ప్రభుత్వ అధికారుల పనితనం

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వారికి వందలకు వందలు పోలీసు వారు పైన్స్‌ రాయడం మనం ఇప్పటి వరకు చూశాం.తాగి బండి నడిపే వారికి, లైసెన్స్‌ లేకుండా బండి నడిపే వారికి చివరకు హెల్మెట్‌ లేని వారికి కూడా ఫైన్స్‌ రాయడం జరిగింది.

 Hyderabad Municipal Body Issues Rs 10000 Challan To Police Later Withdraws It-TeluguStop.com

అయితే పోలీసు స్టేషన్‌కు మాత్రం ఫైన్‌ పడటం బహుషా ఇదే మొదటి సారి అయ్యి ఉంటుంది.గోల్కొండ పోలీసు స్టేషన్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు ఫైన్‌ వేశారు.

అది కూడా వంద రెండు వందలు కాదు ఏకంగా 10 వేల రూపాయలు.

విడ్డూరం : పోలీసులకే ఫైన్‌, ఇద

ఔను నిజమే, జీహెచ్‌ఎంసీ రూల్స్‌ను బ్రేక్‌ చేసిన కారణంగా గోల్కొండ పోలీసు స్టేషన్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఫైన్‌ను పంపించడం జరిగింది.ఫైన్‌ కట్టకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా హెచ్చరించడం జరిగింది.ఇంతకు గోల్కొండ పోలీసులు చేసిన తప్పేంటో తెలుసా వాల్‌ పోస్టర్స్‌ను అంటించడం.

జీహెచ్‌ఎంసీ కొన్ని ప్రదేశాల్లో వాల్‌ పోస్టర్స్‌ను బ్యాన్‌ చేసింది.అక్కడ గోల్కొండ పోలీసులు బోనాలకు సంబంధించిన వాల్‌ పోస్టర్స్‌ను అంటించడం జరిగింది.

బోనాల సందర్బంగా జాగ్రత్తగా ఉండాలని, అవాంచనీయ సంఘటన జరుగకుండా బోనాల వేడుక జరుపుకోవాలంటూ పోలీసు బాసుల ఫొటోలు వేసి మరీ గోల్కొండ పోలీసులు వాల్‌ పోస్టర్స్‌ను ముద్రించారు.

విడ్డూరం : పోలీసులకే ఫైన్‌, ఇద

పోలీసులం మమ్ములను ఏం అంటారు లే అనుకన్నారో లేక తెలియక చేశారో కాని బ్యాన్‌ చేసిన ఏరియాలో వాల్‌ పోస్టర్స్‌ అంటించారు.దాంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఫైన్‌ విధించారు.ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో మాట్లాడితే అప్పుడు రెండు శాఖల మద్య గొడవ సర్దుమనిగింది.

రెండు శాఖల మద్య సమన్వయ లోపం కారణంగా ఈ పొరపాటు జరిగిందని ఈ సందర్బంగా అధికారులు చెబుతున్నారు.దేనికి అదే, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తే ఇదే పరిస్థితి.

అందుకే కలిసి అందరి సమన్వయంతో ముందుకు వెళ్లాలి అంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube