షాకింగ్.. ప్రేమ పెళ్లిళ్లపై సర్వే.. హైదరాబాదీలు ఏమన్నారంటే!

ఈ మధ్య యువత ప్రేమ అంటూ తిరగడం మనం చూస్తూనే ఉన్నాం.కొంతమంది టీనేజ్ నుండే ప్రేమ దోమ అంటూ తిరుగుతూ చదువులు సైతం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

 Hyderabad Mothers Says Yes For Love Marriages Details, Hyderabad, Survey, Hydera-TeluguStop.com

యువత ప్రేమ అంటూ ఎంత తిరిగిన అది మాత్రం పెళ్లి వరకు వెళ్ళేది చాలా తక్కువ.ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని.లేదంటే కులాంతర వివాహాలు ఇంట్లో ఒప్పుకోరని కొంతమంది యువత ఆ ప్రేమలు మధ్యలోనే ఆపేస్తారు.

అయితే ఇటీవల కులాంతర వివాహాలు ఎక్కువ గానే జరుగు తున్నాయి.యువత తమ ప్రేమను మధ్యలోనే ఆపేయకుండా చివరి వరకు తీసుకు వెళ్తున్నారు.ఇంట్లో పెద్ద వారిని ఒప్పించి తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకుంటున్నారు.ఒకవేళ పెద్ద వారు తమ ప్రేమకు అడ్డు చెప్పిన వారిని ఎదిరించి మరి వివాహాలు చేసుకుంటూన్నారు.

కానీ ఇంట్లో పెద్ద వారు ఒప్పుకుంటే జీవితం ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.

మన దేశంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా ఉత్తరాది లోనే జరుగుతున్నాయని ఇప్పటికే పలు సర్వేలు తెలిపాయి.

Telugu Hyderabad, Love Marriages, Madly App-Latest News - Telugu

ఈ విషయంలో మన దక్షిణాది ప్రజలు కొద్దిగా వెనక బడి ఉన్నారనే చెప్పాలి.కానీ తాజాగా సర్వేలో ఒక షాకింగ్ నిజం తెలిసింది.ఏంటంటే మన హైదరాబాద్ లో ఉన్న తల్లిదండ్రుల ధోరణి కూడా మారిందని తాజా సర్వే రుజువు చేసింది.ప్రేమ పెళ్లిళ్లకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారు అనే విషయంపై ట్రూలీ మ్యాడ్లీ అనే డేటింగ్ యాప్ ఒక సర్వే చేపట్టింది.

Telugu Hyderabad, Love Marriages, Madly App-Latest News - Telugu

ఈ సర్వేలో ఒక ఆసక్తికర ఇంకా షాకింగ్ నిజం బయటకు వచ్చింది.ఈ యాప్ చేపట్టిన సర్వేలో హైదరాబాద్ లో ఉండే తల్లులు తమ పిల్లల ప్రేమ వివాహాలకు వారి పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు తేలింది.84 శాతం మంది హైదరాబాద్ నివసించే తల్లులు తమ పిల్లల ప్రేమ పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.అదే దేశం మొత్తం మీద చూసుకుంటే 50 శాతం మంది తల్లులు తమ పిల్లల ప్రేమ వివాహాలను సమర్దిస్తున్నట్టు తెలిపారు.

విన్నారుగా మన హైదరాబాద్ లో నివసించే తల్లులు ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube