వివాహేతర సంబంధానికి అడ్డుగు ఉన్నాడని కన్న కొడుకునే చంపిన తల్లి....

ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాల మోజులో పడి తమ కాపురాలు చేజేతులారా మహిళలు నాశనం చేసుకుంటున్నారు.ఎంతలా అంటే తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని 9 నెలలు కడుపులో మోసి కన్న కొడుకునే దారుణంగా కడతేర్చి తల్లి అనే పదానికి కళంకం తెచ్చింది ఓ మహిళ.

 Hyderabad Mother Son Telangana-TeluguStop.com

వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రాజేంద్ర నగర్ ప్రాంతంలో తన కుమారుడితో కలిసి నివసిస్తున్నా రు.పెళ్లయిన కొత్తలో దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు.దాంతో పెళ్లి అయిన కొద్ది రోజులకే వీరికి ఒక కొడుకు జన్మించాడు.అయితే ఏమైందో ఏమో గానీ ఆ మహిళ వివాహేతర సంబంధం వైపు అడుగులు వేసింది.దాంతో స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అయితే ఈమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త పలుమార్లు హెచ్చరించాడు.

 అయినా కూడా ఆ మహిళ వినేది కాదు.అంతేగాక వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని తన కన్నా కొడుకైనటువంటి అంజద్ ని గొంతు నులిమి చంపేసింది.

 Hyderabad Mother Son Telangana-వివాహేతర సంబంధానికి అడ్డుగు ఉన్నాడని కన్న కొడుకునే చంపిన తల్లి….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.నిందుతురాలిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు  మైలార్ దేవరపల్లి పోలీసులు తెలిపారు.

#Illegal Affair #MotherIllegal #HyderabadCrime #TelanganaLatest #HyderabadLatest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు