బుధవారం నుండి ఎంఎంటిఎస్ రైళ్లు..!

తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేయడంతో ఇప్పుడు అన్ని నిర్వహణలు మొదలవుతున్నాయి.లేటెస్ట్ గా కరోనా కారణంగా ఆగిపోయిన ఎం.

 Hyderabad Mmts Trains Will Starts From Wednessday-TeluguStop.com

ఎం.టి.ఎస్ రైళ్ల సేవలు మళ్లీ మొదలు కానున్నాయి.హైదరాబాద్ వాసులకు ఎం.ఎం.టి.ఎస్ సౌకర్యాలు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి.కరోనా నేపథ్యంలో 15 నెలలుగా ఆగిపోయిన ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు మళ్లీ కూత పెట్టనున్నాయి.కరోనా లాక్ డౌన్ ఎత్తేయడంతో ఎం.ఎం.టి.ఎస్ రైళ్లను నడిపించాలని అధికారులు నిర్ణయించారు. బుధవారం నుండి ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు నడపడానికి రైల్వే మత్రిత్వ శాఖ నుండి అనుమతులు అందుకున్నారు.కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం పది రైళ్లు మాత్రమే తిరుగుతాయని చెబుతున్నారు.పరిస్థితులను బట్టి వాటిని పెంచుతారని అధికారులు చెబుతున్నారు.

 Hyderabad Mmts Trains Will Starts From Wednessday-బుధవారం నుండి ఎంఎంటిఎస్ రైళ్లు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫలక్ నుమా నుండి లింగంపల్లి, లింగంపల్లి నుండి ఫలక్ నుమా కు మూడు, మూడు రైళ్లు తిరగనున్నాయి.హైదరాబాద్ నుండి లింగంపల్లి వరకు రెండు, లింగంపల్లి నుండి హైదరాబాద్ వరకు రెండు రైళ్లు నడుస్తాయి.

ఫలక్ నుమా నుండి లింగంపల్లి వరకు వెళ్లే మొదటి రైలు ఉదయం 7:50 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.లింగంపల్లి నుండి మొదటి ట్రైల్ 9:20 గంటలకు బయలుదేరుతుంది.లింగంపల్లి నుండి హైదరాబాద్ వెళ్లే ట్రైన్ ఉదయం 8:43 గంటలకు, హైదరాబాద్ నుండి లింగంపల్లి వెళ్లే ట్రైన్ 9.36 గంటలకు బయలుదేరుతాయని చెప్పారు.

#Lingampalli #Wednessday #Hyderabad #Hyderabad MMTS #MMTS Trains

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు