మహిళల రక్షణ కోసం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం  

Hyderabad Metro Allows Women To Carry Pepper Spray-

దేశవ్యాప్తంగా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకి పెరిగిపోతుండడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.ఒక సంఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుండడం సర్వసాధారణంగా మారిపోయింది.

Hyderabad Metro Allows Women To Carry Pepper Spray- Telugu Viral News Hyderabad Metro Allows Women To Carry Pepper Spray--Hyderabad Metro Allows Women To Carry Pepper Spray-

ఇటీవల తెలంగాణ లో దిశా సంఘటన చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు మహిళల భద్రత విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు విద్య ఉద్యోగాల నిమిత్తం తరుచుగా ప్రయాణాలు చేస్తూ ఉండడంతో ప్రయాణ సమయంలోనూ వారు పోకిరీల నుంచి అనేక వేధింపులకు గురవుతున్నారు.

దీంతో మహిళలు, అమ్మాయిలు ఆత్మరక్షణ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.మహిళల ఆత్మ రక్షణ కోసం మెట్రోరైళ్లలో పెప్పర్ స్ప్రే వెంట తీసుకెళ్లేందుకు వీలుగా నిబంధనలు రోపొందించారు.

దీనికి సంబంధించి ఇప్పటికే మెట్రో రైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.మహిళల భద్రత విషయాన్ని అత్యంత కీలకంగా తీసుకున్న తాము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

తాజా వార్తలు