కారు నెంబర్ ప్లేట్ పై నెంబర్ కు బదులు సీఎం గారి పేరు

ఎవరికైనా కారు నెంబర్ ప్లేట్ పై నెంబర్ అనేది సహజంగా ఉంటుంది.కానీ హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడు మాత్రం కారు నెంబర్ ప్లేట్ పై నెంబర్ కు బదులు ఏపీ సీఎం జగన్ పేరు రాయించుకొని నడుపుతున్నాడు.

 Hyderabad Man Uses Ap Cm Jagan Name On Car Number Plate-TeluguStop.com

అయితే అతడి కారు నెంబర్ ప్లేట్ ను చూసిన పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.ఫ్యాన్సీ నెంబర్లు తీసుకొని రోడ్లపై కనిపించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

అయితే ఈ యువకుడు మాత్రం కేవలం ఏపీ సీఎం జగన్ పేరు ను మాత్రమే పెట్టుకొని కారుని చలాయిస్తూ వచ్చాడు.అయితే మంగళవారం జీడిమెట్ల పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆ యువకుడి కారు కంటపడింది.

ఇక చూస్తే ఏముంది ఆయన నెంబర్ ప్లేట్ పై జగన్ పేరు ఉండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.దీనితో ఆ యువకుడిని ఎందుకు ఇలా నెంబర్ ప్లేట్ కు బదులు AP CM Jagan అని ఎందుకు రాయించుకున్నావని ప్రశ్నించడం తో అతగాడు చెప్పిన సమాధానానికి అధికారులు అవాక్కయ్యారు.

టోల్ రుసుం మినహాయింపు కోసమే ఇలా ఏపీ సీఎం గారి పేరు రాయించుకున్నానని తెలిపారు.అయితే విషయం తెలుసుకున్న అధికారులు అతడిపై కేసు నమోదు చేసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తుంది.

అయితే కారు యజమాని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన ముప్పిడి హరి రాకేశ్ అని అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube