హైద‌రాబాద్‌లో మాస్ కాపీయింగ్‌.. సీసీ కెమెరాల్లో బ‌య‌ట‌ప‌డ్డ వైనం..!

నేటి తరంలో కొంత మంది కష్టపడి శ్రమించి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.అయితే, ఇంకొందరు మాత్రం తప్పుడు బాటలో విజయం సాధించాలనుకుంటున్నారు.

 Hyderabad Man Arrested Cheating Airman Job Exam Online-TeluguStop.com

సక్సెస్‌కు షార్ట్ కట్స్ వెతుక్కుంటూ తమ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు.అలా తప్పుడు మార్గంలో విజయం సాధించాలనుకుని బుక్కయ్యాడు ఓ యువకుడు.

వివరాల్లోకెళితే.హర్యానాకు చెందిన సౌరభ్ అనే యువకుడు పోటీ పరీక్షల్లో నెగ్గాలనుకున్నాడు.

 Hyderabad Man Arrested Cheating Airman Job Exam Online-హైద‌రాబాద్‌లో మాస్ కాపీయింగ్‌.. సీసీ కెమెరాల్లో బ‌య‌ట‌ప‌డ్డ వైనం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు రాంగ్ రూట్ ఎంచుకున్నాడు.కష్టపడి చదువుకుని ఎగ్జామ్ రాయాలనుకోలేదు.

తన ఫ్రెండ్స్ సాయంతో టెక్నాలజీ ఉపయోగించుకుని ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకున్నాడు.ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్‌లో వాయుసేన ఎయిర్‌మెన్ పరీక్షకు హాజరయ్యాడు.

అక్కడ ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో హైటెక్ తరహా కాపీయింగ్ చేయాలనుకున్నాడు.సరూర్ నగర్ పరిధిలోని ఎస్ఈజెడ్ ఎగ్జామ్ సెంటర్‌లో పరీక్ష రాసేందుకు వచ్చాడు.

ఇక ఇన్విజిలేటర్లకు కనబడకుండా చెవికి రిసీవర్, బనియన్‌కు ఎలక్ట్రానిక్ డివైజ్ పెట్టుకున్నాడు.అలా ఎలక్ట్రానిక్ డివిజెస్ ఉపయోగించుకుని హైటెక్ తరహాలో పరీక్ష రాసేందుకు ప్రయత్నం చేశాడు.

ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల్లో ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని పరీక్ష రాస్తున్న అభ్యర్థులను పరీక్షా కేంద్రం సిబ్బంది పరిశీలించారు.వారికి ఎగ్జామ్ రాస్తున్నట్లు నటిస్తున్న సౌరభ్ కదలికలపై అనుమానం వచ్చింది.దాంతో ఇన్విజిలేటర్లు అతడిని క్లియర్‌గా చెక్ చేశారు.ఎలక్ట్రానిక్ డివైజెస్ సాయంతో ఎగ్జామ్ రాస్తున్న సౌరభ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.హర్యానా నుంచి ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుండటంతో సౌరభ్‌ పరీక్ష రాస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది సరూర్‌నగర్‌ పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.సౌరభ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

అతడి వద్ద నుంచి ఎలక్ట్రానిక్ డివైజెస్ రిసీవర్ ఇతరాలు స్వాధీనం చేసుకున్నారు.సౌరభ్ విచారణ అనంతరం అతడి ఫ్రెండ్స్‌ను కూడా విచారించే అవకాశం ఉంది.

#Hyderabad #Mass Copying #HyderabadMan #Airman Job Exam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు