ఊపందుకున్న లాక్‌డౌన్‌ వార్తలు.. నగరవాసులు ఏం చేస్తున్నారో తెలుసా..?

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్‌ తప్పదు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

 Lockdown, Hyderabad, People Precautions, Covid 19 Cases, Kcr, Again Lockdown In-TeluguStop.com

ఈసారి అంతకుముందు కంటే మరింత కఠినంగా లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది.గతంలో మాదిరిగా కాకుండా కేవలం రెండు గంటలు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందని.

పదిహేను రోజుల పాటు ఇలాగే కొనసాగుతుంది అని అందరూ చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలో నగర వాసులు అందరూ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

కొంతమంది ముందుగా సరుకులు తెచ్చి పెట్టుకుంటూ ఉండగా మరికొంతమంది సొంతూళ్లకు పయనమవుతున్నారు.ఈ సమయంలో అటు మందుబాబులు కూడా తెగ జాగ్రత్త పడిపోతున్నారు.

అంతకుముందు విధించిన లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మందుబాబులు ప్రస్తుతం భారీగా స్టాక్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు.

ఇప్పటికే నగరంలోని ప్రజలందరూ దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారు.

ఈ నేపథ్యంలో నగరాలకంటే పల్లెటూరు బెటర్ సొంతూళ్లకు పయనమవుతున్నారు చాలామంది.మరి కొంతమంది ఈ కరోనా వైరస్ కు భయపడి ప్రాణాలు ఉంటే ఎప్పుడైనా డబ్బులు సంపాదించవచ్చు అంటూ వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేస్తూన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube