హైదరాబాద్ లో లాక్ డౌన్... అంతా ఉత్తుత్తేనా..?

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ నగరంలో మరో సారి లాక్ డౌన్ విధించనున్నారు అనే ప్రచారం ఊపందుకుంది.అదే సమయంలో నగరంలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు వ్యూహాలను అమలు చేస్తామని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం ఈ ప్రచారానికి మరింత బలం వచ్చింది.

 Lockdown, Hyderabad, Ghmc,telangana Govt, Lockdown Rukes, Corona Cases-TeluguStop.com

అయితే హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్ విధించాలా వద్దా అనే దానిపై రాష్ట్రప్రభుత్వం ఎటు తేల్చుకోలేక పోతుంది అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఒకవేళ లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కట్టడి మాత్రం సాధ్యం కాకపోవచ్చని కొంత మంది ప్రభుత్వ వర్గాల నుంచి వాదన ఎక్కువగా వినిపిస్తుంది.

అదే సమయంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత కఠిన నిబంధనల అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే జిహెచ్ఎంసి పరిధిలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల దృశ్య తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ విధించాలని మొదట భావించినప్పటికీ ఆ తర్వాత మాత్రం… లాక్‌డౌన్‌ ఆలోచనను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు నగరంలో లాక్ డౌన్ తప్పదని ప్రచార ఊపందుకున్న నేపథ్యంలో నగర వాసులు అందరూ సొంతూళ్లకు పయనమవుతున్నారు.మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏం నిర్ణయం తీసుకోబోతుంది అన్నది చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube