బాయ్ ఫ్రెండ్ కోసం దొంగలా మారిన హైదరాబాద్ అమ్మాయి  

  • బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిదండ్రులను వదిలేసి అమ్మాయిల్ని చూసుంటారు, ఆస్తులు వదిలేసుకోని చిన్న ఇంటిలో బ్రతికే అమ్మాయిలను చూసుంటారు. కాని బాయ్ ఫ్రెండ్ కోసం దొంగలా మారిన అమ్మాయిని చూసారా? ఇప్పుడు చూపించడం కష్టం కాని, ప్రేమికుడి కోసం దొంగలా మారిన ఓ టీనేజర్ గురించి చెబుతాం చదవండి.

  • తన పేరు కిరణ్మయి. వయసు 19. ఇంజనీరింగ్ చదువుతోంది. ఫేస్ బుక్ ద్వారా చాలామంది అమ్మాయిలని పరిచయం చేసుకున్న కిరణ్మయి, వారితో స్నేహం పెంచుకోని, వారికి ఇంటికి వెళ్ళి, బంగారం దొంగలించడం మొదలుపెట్టింది. ఎలాంటి విలువైన ఆభరణమైన, కంటికి కనబడటమే ఆలస్యం.

  • ఈ నెల 12న కిరణ్మయి స్నేహితురాలి ఇంట్లో 15 తులాల బంగారం చోరి చేయబడింది. ఆ కేసు పోలీసుల దాకా రావడం, ఇంట్లోకి వచ్చిన కిరణ్మయిని కూడా పోలీసులు గట్టిగా అడగటంతో, ఆ దొంగతనంతో పాటు ఇంతకుముందు చేసిన దొంగతనాల గురించి కూడా ఊహించని విషయాలు బయటపడ్డాయి.

  • ఇన్ని దొంగతనాలు ఎందుకు చేసావు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పిన సమాధానమేంటో తెలుసా! తన బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ ఒక జిమ్ ఇన్‌స్ట్రక్టర్ అంట. తన సంపాదన అంతంతమాత్రంగానే ఉండటంతో, తన కోసం కిరణ్మయి ఈ దొంగతనాలు మొదలుపెట్టిందట. పూర్తి వివరాలు బయటకి లాగిన పోలీసులు, దొంగతనాలు చేసిన కిరణ్మయిని, తనకు సహకారం అందించిన యశ్వంత్ ని అరెస్టు చేశారు.