సమిష్టి కృషి వల్లే విజయాన్ని సొంతం చేసుకున్నామని హైదరాబాద్ ఎఫ్ సి ప్రధాన కోచ్ మానోలో మార్ క్యూజ్ అన్నారు.జూబ్లీహిల్స్ లోని బఫెల్లో వైల్డ్ వింగ్స్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు అంతా కలిసి సమిష్టిగా శ్రమించడం వల్లే ఈ విజయాన్ని అందుకోగలిగామని అన్నారు.
ఇండియన్ సూపర్ లీగ్ 21-22 కైవసం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
విజయం అనేది ఒక్క రోజులో సాధ్యం కాదని అలుపెరగకుండా శ్రమించడం ద్వారా నే తమ టీం సభ్యులు ప్రతిష్టాత్మకమైన ఈ విజయాన్ని సొంతం చేసుకున్నామని తెలిపారు.







