హైదరాబాద్ కి చెందిన డెంటల్ డాక్టర్ ప్రీతి రెడ్డి ఆస్ట్రేలియాలో దారుణ హత్యకి గురైంది.ఆమెని ఎవరో కత్తితో పొడిచి చంపి షూట్ కేసులో కుక్కి ఆమె కారులోనే వదిలేసి వెళ్ళినట్లు తెలుస్తుంది.
మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రీతి రెడ్డి చివరిగా ఓ రెస్టారెంట్ లో సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది.ఆ వీడియోలో ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్ కూడా కనిపించాడు.
దీంతో హర్షవర్ధన్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా వుంటే ప్రీతిరెడ్డి కనిపించకుండా పోయిన రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహం లభ్యం అయ్యింది.అయితే చివరిగా ఆమెతో కనిపించిన మాజీ ప్రియుడు హర్షవర్ధన్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఆమెని ఎవరైనా దుండగులు హత్య చేసి హర్ష వర్ధన్ ని కూడా హత్య చేసి ఆక్సిడెంట్ గా క్రియేట్ చేసారా అనే కోణంలో పోలీసులు విచారణ మొదలెట్టారు.
ఇప్పటికే ఈ కేసు విచారణ మొదలెట్టిన పోలీసులు ప్రీతీ రెడ్డి మర్డర్ మిస్టరీని చేధించే ప్రయత్నం మొదలెట్టారు.