'ఆహా' మరియు స్టార్‌ మా పై పబ్లిక్‌ న్యూసెన్స్‌ కేసు నమోదు

తెలుగు ఓటీటీ ఆహా పై హైదరాబాద్‌ కోర్టులో న్యూసెన్స్‌ కేసును నమోదు చేయడం జరిగింది.హైదరాబాద్‌ వ్యాప్తంగా ఆహా వారు పోస్టర్లు మరియు ప్లెక్సీలను పెద్ద ఎత్తున పెట్టడంతో పాటు జనాలకు ఇబ్బంది కలిగించేలా వారు వ్యవహరిస్తున్నారు అంటూ ఈ కేసును నమోదు చేయడం జరిగింది.

 Hyderabad Court Accepted Case About Public Nuisance Against Aha Star Maa Trs Pos-TeluguStop.com

కేవలం ఆహా ఓటీటీ నిర్వాహకులపై మాత్రమే కాకుండా స్టార్‌ మా టీవీ వారిపై కూడా ఈ కేసును నమోదు చేయడం జరిగింది.అనుమతులు లేకుండా ఇష్ట్రానుసారంగా పోస్టర్ లను మరియు ప్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు గాను వీరిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైదరాబాద్‌ లో పెరుగుతున్న ఈ ప్లెక్సీలు మరియు పోస్టర్ ల వల్ల జనాలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయాన్ని కొందరు కోర్టు దృష్టికి తీసుకు రావడం వల్ల విచారణ జరుపుతున్నారు.

ట్రాఫిక్‌ పోలీసు విభాగంతో పాటు ఇతర విభాగాలను ప్రతివాధులుగా చేర్చడంతో పాటు వారిపై తీసుకుంటున్న చర్యల గురించి కూడా కోర్టు ప్రశ్నించినట్లుగా సమాచారం అందుతోంది.ఆహా మరియు స్టార్‌ మా మాత్రమే కాకుండా హైదరాబాద్ లో అనుమతులు లేకుండా ప్లెక్సీలు పెడుతున్న వారిలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ కూడా ఉంది.

ఇంకా తెలంగాణ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ మరియు ఎంఐఎం పార్టీలు కూడా కోర్టు నోటీసులు అందుకున్నాయి.హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా న్యూసెన్స్‌ సృష్టిస్తున్నారని వారిపై ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పై ఇలాంటి కేసు నమోదు అవ్వడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.ఈ కేసు నుండి ఆహా మరియు స్టార్‌ మా వారితో పాటు ఇతరులు ఎలా బయట పడతారో చూడాలి.

ఈ కేసు నేపథ్యంలో హైదరాబాద్‌ లో పెద్ద పెద్ద ప్లెక్సీలు ఇబ్బడి ముబ్బడిగా ఉండే పోస్టర్‌ లకు చెక్‌ పెట్టే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube