అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలంటున్న ఎన్టీఆర్!

ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ పరిచయాల వల్ల యువతులు, మహిళలపై వేధింపులు సంగతి తెలిసిందే.సైబర్ మోసగాళ్లు మాయమాటలు చెప్పి అమాయక యువతులను నమ్మించి వేధింపులకు పాల్పడుతున్నారు.

 Hyderabad City Police Make A Video On Cyber Crimes, Junior Ntr, Hyderabad City P-TeluguStop.com

సైబర్ మోసగాళ్లు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పరిచయమై కొన్ని రోజులు సన్నిహితంగా మెలిగి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆన్ లైన్ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో మన వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేయకపోవడమే మంచిదని ఎన్టీఆర్ సూచించారు.సోషల్ మీడియాలో చేసే పోస్టుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఆన్ లైన్ లో తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెల్లడించారు.అపరిచిత వ్యక్తుల ఆన్ లైన్ పరిచయాల వల్ల ఏవైనా సమస్యలు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

హైదరాబాద్ నగర్ పోలీసులు సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఆన్ లైన్ మోసాల గురించి జూనియర్ ఎన్టీఆర్ తో వీడియో చేయించారు.సినీ నటుల ద్వారా ఇలాంటి వీడియోలు చేయిస్తే ప్రజలకు వేగంగా మోసాలపై అవగాహన కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు ఒక యువతులు ఫేస్ బుక్ ద్వారా ఎదుర్కొన్న అనుభవాన్ని చిత్రీకరించి షార్ట్ ఫిలిం రూపంలో రూపొందించారు.
సమాజంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి.

మాయమాటలు చెప్పి కీలక సమాచారం తెలుసుకుని ఆ తర్వాత మహిళలు, యువతులపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.చాలామంది యువతులు ఇలాంటి ఘటనల్లో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

దీంతో యువతులు, మహిళలకు హైదరాబాద్ పోలీసులు సమాజంలోని వాస్తవ పరిస్థితులను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఎన్టీఆర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube