ఆప్ఘన్ దెబ్బకి హైదారాబాద్ బిర్యానీకి రెక్కలు..?!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు ఒకటే తాలిబన్లు.ఆప్ఘన్ ఆక్రమించుకున్న తర్వాత వారి ఉనికి మొదలైంది.ఇప్పుడు వారి ఎఫెక్ట్ హైదరాబాద్ మీద కూడా పడింది.హైదరాబాదులో తాలిబన్ నుంచి డ్రైఫ్రూట్స్ ఎక్కువగా దిగుమతి అవుతూ ఉంటాయి.అయితే ఆఫ్ఘనిస్థాన్ లో దేశ ప్రజలు తాలిబన్ హస్తగతం అయిన తర్వాత అక్కడి నుండి డ్రైఫ్రూట్స్ రవాణా ఆగిపోయింది.దీంతో మిగిలిన దేశాలలో గిరాకీ ఎక్కువగా పెరిగింది.వాటి రేట్లు కూడా బాగా పెరిగాయి.డ్రై ఫ్రూట్స్ రేట్లు పెరగడం వల్ల హైదరాబాదులోని బిర్యానీ రేటు కూడా పెరిగింది. భారతదేశానికి డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ నుండి దిగుమతి చేసుకుంటారు.ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ స్థాయిలోనే రవాణా అవుతుంటాయి.

 Hyderabad Biryani Wings To Afghan Blow  Afghanistan, Talibans, Effect ,hyderabad-TeluguStop.com

ఆఫ్ఘనిస్తాన్ నుంచి కిస్మిస్, అంజిరా, సాజీరా, బాదం ఇంకా సుగంధ ద్రవ్యాలు దిగుమతి అవుతుంటాయి.

అయితే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకోవడం వల్ల గత కొద్ది రోజులుగా ఆ రవాణా మొత్తం ఆగిపోయింది.

దీనివల్ల భారత్ 200ల లారీల డ్రై ఫ్రూట్స్ దిగుమతి జరగలేదు.హోల్ సేల్ గా అయితే 800 రూపాయలు ఉండే ఎండు ద్రాక్ష ఇప్పుడు 1300 కి చేరింది.రూ.900 ఉండే అంజీరా ఇప్పుడు 1400 అయింది.

Telugu Afghanistan, Effect, Hiked, Rates, Talibans, Latest-Latest News - Telugu

గత నెలలో 380 రూపాయలు ఉన్నా సాజీరా ఇప్పుడు కిలో 600 రూపాయలకు చేరింది.ఇంకా బ్లాక్ అఫ్రికాట్స్ 300 రూపాయల నుండి 700 రూపాయల చేరింది.గ్రీన్ అఫ్రికాట్స్ 300 నుంచి 500 రూపాయలు పెరిగింది.ఈ ఐదు రోజుల్లోనే రేట్లు కూడా ఆకాశాన్ని అంటాయి.

దేశవ్యాప్తంగా ఎక్కువశాతం హైదరాబాదులోని బిరియాని సేల్ అవుతుంది.మరి అటువంటి బిర్యానీ రేట్లు హైదరాబాదులో పెరగడం వల్ల బిరియానీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube