భార్యను వదిలిపెట్టి ఆస్ట్రేలియా వెళ్లిన ఎన్ఆర్ఐ... చుక్కలు చూపించిన పోలీసులు

విదేశాల్లో ఉద్యోగాన్ని ఎరగా వేసి భారీగా కట్నకానుకలు అందుకుని తీరా భార్యను తనతో పాటు తీసుకెళ్లమంటే వీసా, ఇమ్మిగ్రేషన్ పేరి చెప్పి.వారిని భారత్‌లోనే వుంచేస్తున్న పలువురు ఎన్ఆర్ఐల ఆగడాలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి.

 Hyderabad Based Techie Arrested In Delhi Airport Over Domestic Violence, Telanag-TeluguStop.com

తాజాగా ఓ యువతిని పెళ్లి చేసుకుని ఆమెను తనతో పాటు ఆస్ట్రేలియా తీసుకెళ్లకుండా భారత్‌లోనే వదిలిపెట్టిన టెక్కీకి పోలీసులు చుక్కలు చూపించారు.

వివరాల్లోకి వెళితే… తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన ఓ యువతికిహైదరాబాద్ జీడిమెట్ల పద్మారావునగర్‌కు చెందిన సురేశ్ అనే యువకుడితో గతేడాది ఆగస్టు 6న వివాహం జరిగింది.

సురేశ్ ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండటంతో పెళ్లయిన 15 రోజుల తర్వాత అక్కడికి బయల్దేరాడు.అయితే భార్యను కొన్ని రోజుల తర్వాత తీసుకెళ్తానని చెప్పి తాను ఒక్కడే ఆస్ట్రేలియా వెళ్లాడు.

అప్పటినుంచి అత్తగారింట్లోనే ఉన్న ఆ యువతిని ఆడపడుచు, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు.

Telugu Nakirekhal, Nalgonda, Singh Bajwa, Suresh, Telanagana-Telugu NRI

ఇంట్లో తనపై జరుగుతున్న వేధింపులను ఆ యువతి భర్త సురేష్‌కు చెప్పింది.అయితే ఎన్నిసార్లు తన గోడు వెళ్లబోసుకున్నా భర్త నుంచి స్పందన లేకపోవడంతో బాధితురాలు నల్గొండ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న స్థానిక సీఐ.

నల్గొండ ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌ ద్వారా ఆస్ట్రేలియా ఎంబసీ సహకారంతో సురేష్‌ పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి మెయిల్‌ పెట్టారు.ఆ తర్వాత సురేశ్ బాగోతంపై సంస్థ నిర్వాహకులకు ఫోన్‌లో చెప్పడంతో అతని ఉద్యోగం పోయింది.

అనంతరం సురేష్‌ .భారత్‌ తిరిగి వచ్చేలా పోలీసులు ఒత్తిడి తెచ్చారు.ఈ క్రమంలో ఫిబ్రవరి 2న ఢిల్లీ విమానాశ్రయంలో నల్గొండ సీఐ … ఇమ్రిగేషన్‌, విమానాశ్రయ అధికారుల సహకారంతో సురేష్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

కాగా, భార్యలను వదిలేస్తామని బెదిరింపులకు పాల్పడిన 382 ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు భారత ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో తెలిపింది.2015 నుంచి ఇప్పటివరకు ఇలా 382 పాస్‌పోర్టులను రద్దు చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.అలాగే ఇటువంటి కేసులలో ఇప్పటి వరకు 216 మంది మహిళలు ప్రభుత్వం నుండి న్యాయ, ఆర్థిక సహాయం కోరినట్లు వెల్లడించింది.

కాంగ్రెస్ ఎంపీ పార్తాప్ సింగ్ బజ్వా అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల శాఖ ఈ వివరాలు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube