యుద్ధ విమానం నడిపిన వారిలో హైదరాబాదీ! ఆయన ఎవరని అడిగితే ఏమన్నారంటే.?

పుల్వామా దాడి తర్వాత భారత సేనలు ప్రతీకారం తీర్చుకొన్నాయి.పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో టెర్రరిస్ట్ స్థావరాలపై మిరాజ్ యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ తరహా దాడులకి పాల్పడింది.

 Hyderabad Based Filet Participate In Iaf Surgical Strike-TeluguStop.com

ఈ దాడిలో సుమారు మూడు వందల మంది టెర్రరిస్ట్ లు మరణించినట్టు భారత రక్షణ శాఖ ప్రకటించింది.అత్యాధునిక మిరాజ్ 2000 విమానాలతో బాంబుల వర్షం కురిపించింది.

ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది.

అయితే యుద్ద విమానాలు నడిపిన వారిలో మన హైదరాబాదీ కూడా ఉన్నారు.

దీనికి సంబంధించి కొన్ని టీవీ ఛానళ్లలో స్క్రోలింగ్‌ రావడంతో ఆయన ఎవరు అనే విషయంపై చాలామంది చర్చింకుంటున్నారు.ఆ పైలట్ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు.

ఈ విషయంపై రక్షణ శాఖ నుంచి కూడా ఎలాంటి సమాచారం రాలేదు.నిర్థారణ కోసం పలు మీడియా సంస్థలు రక్షణ శాఖ అధికారులను సంప్రదించగా సమాచారం ఇచ్చేందుకు వారు నిరాకరించారు.

దాడుల్లో పాల్గొన్న సైనికులు, పైలట్ల వివరాలు బహిర్గతం చేసేందుకు నిబంధనలు అంగీకరించవని వారు తెలిపారు.

వారి గురించి వివరాలు తెలుస్తే…వారి కుటుంబాలకు ప్రమాదమని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.అందుకే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నామని వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube