అఖిలప్రియ బెయిల్ విషయంలో షాకిచ్చిన పోలీసులు.. !  

Hyderabad, akhila priya, kidnap case, police - Telugu Akhila Priya, Hyderabad, Kidnap Case, Police

బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరుపరచిన విషయం తెలిసిందే.అప్పటి నుండి ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది.

TeluguStop.com - Hyderabad Akila Priya Kidnap Case Updates

ఇక హాఫీజ్ పేట భూ వివాదంలో పోలీసులు అరెస్ట్ చేసిన భూమా అఖిల‌ప్రియ త‌న ఆరోగ్య ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాల‌ని ఇదివరకు పిటిష‌న్ వేసి సమయంలో ఆ బెయిల్ రాలేకపోయింది.దీని గురించిన వాదనలు అప్పటి నుండి కొనసాగుతూనే ఉన్నాయి.

కాగా అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై ఈరోజు వాదనలు ముగిశాయట.మరికాసేపట్లో బెయిల్ పై తీర్పు ఇవ్వనుంది సికింద్రాబాద్ కోర్టు.

ఈ సమయంలో పోలీసులు భూమా అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దంటూ కౌంటరు దాఖలు చేసారు.ఇక అఖిలప్రియ కుటుంబానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉందని, అదీగాక ఇంకా పోలీసులకు దొరకని అఖిలప్రియ భర్త భార్గవ రామ్ నేరప్రవృత్తి కలిగిన వ్యక్తి అని, అతను ఇంకా బయటే ఉండటం వల్ల అఖిలకు బెయిల్ వస్తే ఈ కేసు నుండి తప్పించుకోడానికి మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి అఖిల ప్రియకు ఎట్టి పరిస్థితిలో బెయిల్ ఇవ్వొద్దని బోయినపల్లి పోలీసులు కోరుతున్నారట

.

#Kidnap Case #Police #Hyderabad #Akhila Priya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు