ఎన్నారైలకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్...RTPCR టెస్ట్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్...

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు ప్రయాణీకుల పై ఆంక్షలు విధించాయి.నెల రోజుల క్రితం వరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిన ప్రయాణాలు ఒక్క సారిగా ఆంక్షల నేపథ్యంలో పూర్వపు స్థితికి చేరుకున్నాయి.

 Hyderabad Airport Nris To Register Rtpcr Test Online Webiste Details-TeluguStop.com

ఈ క్రమంలోనే భారత్ కూడా దేశంలోకి వచ్చే ప్రయాణీకుల విషయంలో కొన్ని ఆంక్షలు విధిస్తూ వాటిని పాటించాలని సూచించింది.భారత్ వచ్చే విదేశీయులు కానీ, ఎన్నారైలు కానీ ఎయిర్ పోర్ట్ లో దిగిన తరువాత తప్పకుండా RTPCR చేయించుకోవాలని, అందులో నెగిటివ్ వస్తే ఇంటికి వెళ్ళిన తరువాత స్వీయ క్వారంటైన్ లో ఉండాలని తెలిపింది.

పాజిటివ్ వస్తే స్థానికంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో చికిత్స చేయించుకోవాలని తగ్గిన తరువాత మాత్రమే సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతులు ఇస్తామని తెలిపింది.ఈ క్రమంలో

ఎన్నారైల రాకతో భారత్ లోని పలు ఎయిర్ పోర్ట్ లు కిక్కిరిసి పోతున్నాయి.

కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి సుమారు 4 గంటల పాటు, ఫలితాలు రావడానికి మరి కొన్ని గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యం లో ఎన్నారైలు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు.

దాంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఆన్లైన్ లో ముందస్తుగా కరోనా టెస్ట్ బుకింగ్ ఏర్పాటు చేసింది.ప్రయాణానికి ముందుగానే ప్రయాణికులు ఎవరైనా సరే ఎయిర్ పోర్టు కు చెందిన వెబ్సైటు లో అలాగే టెస్ట్ లు నిర్వహిస్తున్న మ్యాప్ మై జినోమ్ ల్యాబ్ వెబ్సైటు లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

Telugu Hyderabad, Rtpcr, Telugu, Telugustop-Telugu NRI

ఏ దేశం నుంచి వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు.ఏ సమయంలో చేరుకుంటారు అనే విషయాలు సదరు వెబ్సైటు లో పొందుపరచాలి, సాధారణ RTPCR టెస్ట్ కు గాను రూ.750 ర్యాపిడ్ RTPCR టెస్ట్ కు గాను రూ.3900 ఆన్లైన్ లో చెల్లిస్తే సరిపోతుంది.ఇలా చేయడం వలన సాంపిల్ ఇవ్వడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఈ స్లాట్ ను బట్టి మీకు అవకాశం ఉంటుంది, ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.వెబ్సైటు లింక్స్

https://www.hyderabad.aero/home.aspx

https://mapmygenome.in/

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube