సీఎం కేసీఆర్‌ సభ రద్దు  

Huzurnagar Kcr Meeting Cancel-huzurnagar Trs Candidate Shanampudi Saidhi Reddy,kcr

హుజూర్‌ నగర్‌లో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ అక్కడ విస్తృతంగా పర్యటించి ప్రచారం చేసిన విషయం తెల్సిందే.హరీష్‌ రావు కూడా హుజూర్‌ నగర్‌లో ప్రచారం చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.అధికార పార్టీ ఎలాగైనా ఆ స్థానంను గెలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.మామూలుగా అయితే ఇలాంటి ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఎవరు కూడా పెద్దగా ప్రచారంకు వెళ్లరు.

Huzurnagar Kcr Meeting Cancel-huzurnagar Trs Candidate Shanampudi Saidhi Reddy,kcr-Huzurnagar KCR Meeting Cancel-Huzurnagar Trs Candidate Shanampudi Saidhi Reddy Kcr

కాని హుజూర్‌ నగర్‌ పరిస్థితులు వేరు.కనుక హుజూర్‌ నగర్‌లో కేసీఆర్‌ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు.నేడు భారీ ఎత్తున కేసీఆర్‌ సభను నిర్వహించాలని భావించారు.అందుకోసం నియోజక వర్గం మొత్తం నుండి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మరియు నాయకులు హుజూర్‌ నగర్‌ చేరుకున్నారు.ఈ సమయంలో భారీగా వర్షం రావడంతో కేసీఆర్‌ హెలికాఫ్టర్‌ ఎగిరేందుకు ఏవియేషన్‌ అధికారులు అనుమతించలేదు.

Huzurnagar Kcr Meeting Cancel-huzurnagar Trs Candidate Shanampudi Saidhi Reddy,kcr-Huzurnagar KCR Meeting Cancel-Huzurnagar Trs Candidate Shanampudi Saidhi Reddy Kcr

దాంతో కేసీఆర్‌ సభ రద్దయ్యింది.కేసీఆర్‌ సభ రద్దవ్వడంతో ఎక్కడి వారు అక్కడికి వెళ్లి పోయారు.కేసీఆర్‌ వస్తే గెలుపుపై నమ్మకం కలుగుతుందని భావించిన శానంపూడి సైదిరెడ్డికి ఇది చేదు పరిణామంగా చెప్పుకోవచ్చు.ఆయన పీసీసీ చీప్‌ ఉత్తమ్‌ భార్య పద్మవతితో పోటీ పడుతున్న విషయం తెల్సిందే.

ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.